వాట్.. ఆ హీరోతో అనుష్క శెట్టి రొమాన్స్ చేస్తుందా..? బ్రెయిన్ దొబ్బిందా ఏంటి..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో జేజమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న అనుష్క శెట్టికి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే విషయం గురించి మనం కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. నాగార్జున నటించిన సూపర్ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో ఏలేసింది. స్టార్స్ తో యంగ్ హీరోస్తో సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఒక సినిమాలో నటించాక ఆ సినిమా హిట్ అవుతుందా..? ఫ్లాప్ అవుతుందా..? అని పెద్దగా ఆలోచించదు అనుష్క శెట్టి . అందుకే ఆమెను జనాలు ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు .

నిశ్శబ్దం సినిమా తర్వాత చాలా టైం గ్యాప్ తీసుకున్నారు అనుష్క శెట్టి . మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాలో నటించింది . ఈ సినిమాలో ఆమె పెర్ఫార్మెన్స్ కి మంచి మార్కులు పడ్డాయి . సినిమా కూడా బాగా జనాలకు నచ్చేసింది . అయితే ఇప్పుడు అనుష్క శెట్టి మరొక కొత్త సినిమాలో నటిస్తుంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో గాటి అనే సినిమాలో నటిస్తుంది . ఈ సినిమాలో అనుష్క వేశ్య పాత్రలో కనిపించబోతుందట .

ఆల్రెడీ వేదం సినిమాలో క్రిష్ దర్శకత్వంలో అనుష్క వేశ్య పాత్రలో కనిపించినప్పించింది. మరోసారి అదే రిస్క్ చేయబోతుంది అనుష్క అంటున్నారు జనాలు . అయితే ఈ సినిమాలో తమిళ్ హీరో ప్రభు కొడుకు హీరోగా నటిస్తూ ఉండడం గమనార్హం . ఈ సినిమాలో వీరిద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ కూడా ఉంటాయట . కథనుసారం క్రిష్ అలాంటి సీన్స్ రాసుకున్నారట . అందుకు అనుష్క కూడా ఓకే చెప్పిందట . అనుష్క వయసుకి ప్రభు కొడుకు వయసుకి ఏమాత్రం సంబంధం లేదు . అలాంటి ఒక యంగ్ హీరోతో అనుష్క రొమాన్స్ చేయడానికి నిర్ణయించుకోవడంతో జనాలు ఫైర్ అయిపోతున్నారు .బుద్ధుందా..? బ్రెయిన్ ఉందా..? చిప్ ఎగిరిపోయిందా ..? అంటూ ఘాటుగా ట్రోల్ చేస్తున్నారు . అనుష్క శెట్టి తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది..!!