ఇక పై తారక్ ఆ హీరోయిన్ తో నటించడా..? అంత కఠిన నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అంటే..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బాగా బాగా వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న తారక్ .. ప్రెసెంట్ దేవర సినిమాలో నటిస్తున్నాడు . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను తనదైన స్టైల్ లో డైరెక్టర్ చేస్తున్నాడు . రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది. హీరో తారక్ ఇకపై హీరోయిన్ సమంతతో స్క్రీన్ షేర్ చేసుకోబోయేది లేదు అంటూ న్యూస్ బాగా వైరల్ గా మారింది .

తారక్ ముందు నుంచి హీరోయిన్స్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు. తన వల్ల ఆ హీరోయిన్స్ కి బ్యాడ్ నేమ్ రావడం ఇష్టం లేని ఈ హీరో ముందు నుంచే జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే రీజన్ ఏంటో తెలియదు కానీ ఇకపై హీరోయిన్ సమంతతో స్క్రీన్ షేర్ చేసుకోకూడదు అంటూ డిసైడ్ అయ్యారట. దానికి కారణం నాగచైతన్యతో విడాకులు అంటున్నారు జనాలు. అయితే దీనిపై ఎక్కడా కూడా అఫీషియల్ ప్రకటన లేదు.

ఎందుకు తారక్ ఇలాంటి డెసిషన్ తీసుకున్నాడు..? తారక్ – సమంతల మధ్య ఏమైనా గొడవలు అయ్యాయా ..? ఒకప్పుడు వీళ్ళు చాలా బాగున్నారు కదా..? పెళ్లయిపోయి విడాకులు అయిపోయిన హీరోయిన్ తో నటిస్తే ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది ..? అంటూ ముందు నుంచే జాగ్రత్త పడుతున్నారా ..? అంటూ రకరకాల ప్రశ్నలతో సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది. దీనిపై తారక్ వివరణ ఇస్తేనే బాగుంటుంది.. అసలు నిజంగానే తారక్ సమంతతో నటించను అంటూ చెప్పేసాడా..? కేవలం ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యే పుకారేనా..? తెలియాలి అంటే తారక్ నోరు విప్పాల్సిందే..!!