పాపం .. పాన్ ఇండియా హీరోలకి తాజాగా వైరల్ అవుతున్న న్యూస్ .. బిపిని పెంచేస్తున్నాయి . మరీ ముఖ్యంగా కొంతమంది పాన్ ఇండియా స్టార్స్ కొన్ని సంవత్సరాలు కష్టపడి కెరియర్లో కొన్ని కొన్ని వదులుకొని.. మరి నటించిన సినిమాలు ఊహించని విధంగా పోస్ట్ పోన్ చేసుకోవాల్సిన పరిస్థితులు దాపురించాయి . మనకు తెలిసిందే పాన్ ఇండియా స్టార్స్ ఎంత కష్టపడి సినిమాలో నటిస్తారు. కేవలం హీరో మాత్రమే కాదు.. హీరో హీరోయిన్ డైరెక్టర్ కెమెరామెన్ ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు కొంతమంది కొన్ని సంవత్సరాలు తమ జీవితాన్ని త్యాగం చేసి మరి.. ఆ సినిమాలను తెరకెక్కిస్తూ ఉంటారు .
అయితే తీరా రిలీజ్ టైం లో కొన్ని అనివార్య కారణాల చేత అవి పోస్ట్ పోన్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది . ప్రెసెంట్ అలాంటి సిచువేషన్ ఫేస్ చేస్తున్నాడు పాన్ ఇండియా హీరోలు. రీసెంట్ గానే తారక్ నటించిన దేవర సినిమా పోస్ట్ పోన్ అయిన విషయం తెలిసిందే . ఏప్రిల్ 5న రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల చేత అక్టోబర్ 10కి పోస్ట్ పోన్ అయింది . అంతేకాదు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా కూడా అలాగే పోస్ట్ పోన్ అవుతుంది అంటూ ప్రచారం జరుగుతుంది .
మే 9న రిలీజ్ అవ్వాల్సిన కల్కి సినిమా కొన్ని కారణాల చేత ఆగస్టు 15 కు రిలీజ్ చేయాలి అని ఫిక్స్ చేశారట మేకర్స్. ఆల్రెడీ ఆగస్టు 15వ తేదీ పుష్ప ఆ రిలీజ్ డేట్ ను లాక్ చేసి పెట్టుకొని ఉన్నాడు . ఇప్పుడు ఒకే తేదీన రెండు బడా సినిమాలు రిలీజ్ అయితే కచ్చితంగా ఒక సినిమాకి భారీ బొక్క తప్పదు అంటున్నారు సినీ విశ్లేషకులు . పోనీ ఒక హీరో కోసం మరొక హీరో త్యాగం చేసిన ఫ్యాన్స్ ఊరుకోరు.
ఎవరికి వాళ్ళ సినిమా ఇంపార్టెంట్ . ఒకవేళ ప్రభాస్ కోసం బన్నీ త్యాగం చేసిన బన్నీ మళ్లీ అక్టోబర్లో దేవరతో తలపడాల్సి ఉంటుంది . ఆగస్టులో అల్లు అర్జున్తో పోటీ పడడం ఇష్టం లేకనే తారక్ ఎవ్వరికీ టచ్ కాకుండా దసరాకి రావాలని ఫిక్స్ అయ్యాడు. ఇప్పుడు తారక్ సినిమాకి మళ్ళీ బొక్క పడేలా ఉంది . దీంతో ఒకదాని తర్వాత ఒకటి పాన్ ఇండియా స్టార్స్ కి కొత్త తలనొప్పులు స్టార్ట్ అయ్యాయి. అయితే రామ్ చరణ్ మాత్రం సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయాడు . చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ పై పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఎప్పుడు రిలీజ్ అయిన ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది అంటూ సొంత ఫ్యాన్స్ చెప్పుకొచ్చేస్తున్నారు..!!