నాని – వేణు కాంబో మూవీ టైటిల్ ఇదే.. బలగం అమ్మ మొగుడు లాంటి హిట్ పక్కా..

నాచుర‌ల్ స్టార్ నాని, వేణు యెల్లంది డైరెక్షన్ లో సినిమా తెర‌కెక్క‌నుంద‌ని.. దిల్ రాజు ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు అంటూ గత కొంతకాలంగా వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయాన్ని ప్రొడ్యూసర్ దిల్ రాజు అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. లవ్ మీ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని షేర్ చేసుకున్నాడు. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ నాని – వేణు కాంబోలో సినిమా ఫిక్స్ అయినట్లు చెప్పుకొచ్చాడు. ఈ మూవీ అప్డేట్ ఏంటి అని అభిమాని ప్రశ్నించగా.. దిల్ రాజు స్పందిస్తూ.. మూవీ ఫైనల్ అయింది. ఎల్లమ్మ వస్తది అంటూ చెప్పుకొచ్చాడు. అది వినగానే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అంతా గట్టిగా అరుస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. నాని మూవీ రావడమే కాదు సినిమా టైటిల్ ని ఎట్ట‌మ్మ అని ఫిక్స్ చేయ‌డం.. దిల్ రాజు దానిని అనౌన్స్ చేయ‌డంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.

ఇక బలగం మూవీ డైరెక్టర్ తో ఒక సినిమా నటించాలని ఉంది అంటూ గతంలో నాని చెప్పుకొచ్చాడు. అప్పటి నుంచి అభిమానులు నాని – వేణు కాంబినేషన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో దిల్ రాజు ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసాడు. కాగా ఊర మాస్ మూవీ దసరాతో హిట్ అందుకున్న నాని.. మరోసారి ఈ ఎల్లమ్మ లాంటి పాత్రతో మాస్‌ సినిమాలో కనిపించబోతున్నట్లు సమాచారం. అయితే ఈ ఎల్లమ్మ మూవీ స్టోరీ బ్యాక్ డ్రాప్ ఏంటనేది మాత్రం ప్రస్తుతానికి సీక్రెట్ గానే ఉంచారు. ఇప్పుడు నాని సరిపడా శనివారం మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత నాని 32 మూవీ లైన్ లో ఉంది. రెండు సినిమాలు పూర్తయిన తర్వాతనే నాని – వేణు కాంబోలో మూవీ సెట్స్‌ పైకి రానుందట. ఇక ఈ సినిమా ఫిక్సయింది.. ఎల్ల‌మ్మ‌ వస్తది అని దిల్ రాజు చెప్పారేతప్న‌.. దానికి సంబంధించిన మరి ఇంకే విషయాలను షేర్ చేసుకోలేదు.

ఇక నాని ప్రస్తుతం నటిస్తున్న సరిపోదా శనివారం ఆగస్టు 29 ప్రేక్షకులు ముందుకు రానుంది. వివేకాత్రేయ ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నాడు. ఇది ఒక సూపర్ హీరో సినిమాగా తెలుస్తుంది. ఈ మూవీ తర్వాత ఓజీ ఫేమ్ డైరెక్టర్ సుజిత్ తో మరో సినిమా చేయనున్నాడు నాని. ఇక అడపా ద‌డ‌పా కామెడీ సినిమాల‌ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన వేణు.. జబర్దస్త్ సో ద్వారా భారీ పాపులారిటి దక్కించుకున్నాడు. గతేడాది బలగం సినిమా ద్వారా డైరెక్టర్ గా పరిచయమై బ్లాక్ బ‌స్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక్క సినిమాకే నాని లాంటి హీరోతో సినిమా చేయడానికి ఛాన్స్ కొట్టేసాడంటే ఆ సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక వీరిద్దరి కాంబోలో ఎల్లమ్మ అనే టైటిల్ తో సినిమా వస్తుందని తెలియడంతో ఎల్లమ్మ టైటిల్ చూస్తేనే బలగంకి అమ్మ మొగుడు లాంటి సినిమా రాబోతుందని అర్థమవుతుంది అంటూ కామెంట్ చేస్తున్నారు ఫ్యాన్స్‌.