“ఎవ్వడ్రా ఆ కూత కూసిన పనికిమాలిన వెధవ”.. కోపంతో ఊగిపోయిన రష్మిక మందన్నా..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో రష్మిక మందన్న పేరు ఏ రేంజ్ లో హాట్ టాపిక్ గా వైరల్ అవుతుందో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి రష్మికకు సంబంధించిన నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . అంతేకాదు యానిమల్ సినిమాలో ఆమె నటించిన తర్వాత ఆమె ఎక్కువగా రొమాంటిక్ సినిమాల వైపే ఇంట్రెస్ట్ చూపిస్తుంది అన్న ప్రచారం ఊపందుకుంది.

ఈ క్రమంలోనే రష్మిక మందన్నా.. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ..”తనకు బోల్డ్ కంటెంట్ సినిమాలు అంటే ఇష్టం అని.. అలాంటి వాటికోసం చూస్తున్నాను అని ..రష్మిక మందన్నా కామెంట్ చేసినట్లు ఓ న్యూస్ బాగా వైరల్ అయింది . దీనితో రష్మిక మందన్నా.. ఆ న్యూస్ పై స్పందించింది . “నేను ఎప్పుడూ కూడా అలాంటిది చెప్పలేదు.. నేను ఎప్పుడూ అలాంటి రోల్స్ చేయాలి ఇలాంటి రోల్స్ చేయాలి అని పెట్టుకోను.. నచ్చిన రోల్స్ ఏవైనా చేసేస్తాను” అంటూ చెప్పుకొచ్చింది .

అంతేకాదు యానిమల్ సినిమా తర్వాత రెమ్యూనరేషన్ పెంచేసింది . హెడ్ వెయిట్ పెరిగింది అంటూ కూడా కామెంట్స్ చేశారు . దానికి రష్మిక ఘాటైన జవాబు ఇచ్చింది . నిజంగా అంత రెమ్యూనరేషన్ తీసుకుంటే నేను లక్కీనేగా.. అయితే నిజమేంటంటే వైరల్ అవుతున్న వార్త నిజం కాదు .. అదే నిజం అంటూ తనదైన స్టైల్ లో కౌంటర్ వేసింది. ప్రజెంట్ సోషల్ మీడియాలో రష్మిక మందన్నా మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి . అయితే కొంతమంది రష్మిక ఫ్యాన్స్ కూసింత ఘాటు లాంగ్వేజ్ లో ఆమె మాటలను ట్రెండ్ చేస్తున్నారు..!!