“గామి” సినిమా బాగున్నా..జనాలకు నచ్చకపోవడానికి కారణం అదే.. విశ్వక్ సేన్ టైం ఎంత బ్యాడ్ అంటే..!

నేడు మహాశివరాత్రి సందర్భంగా విశ్వక్ సేన్ నటించిన.. గామి సినిమా థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ అయింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యంగ్ హీరో విశ్వక్ సేన్.. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమానే.. ఈ గామి . విద్యాధర్ ఈ సినిమాను డైరెక్టర్ చేశాడు. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ చాందిని చౌదరి హీరోయిన్గా నటించింది .

కార్తీక్ ఈ సినిమాను ఎంతో ఇష్టంగా నిర్మించారు. ఈ సినిమా ప్రమోషన్స్ ఏ విధంగా విశ్వక్ సేన్ చేశారో మనకు తెలిసిందే. సినిమా పోస్టర్స్ ..టీజర్.. ట్రైలర్ అభిమానుల్లో ఆసక్తి పెంచాయి . కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా అభిమానులను ఓ రేంజ్ లో ఆకట్టుకునేసింది . మరీ ముఖ్యంగా ఈ సినిమాలో విశ్వక్ సేన్ నటన చాలా చాలా అద్భుతంగా ఉంది అంటూ చెప్పుకొస్తున్నారు .

విజువల్ వండర్ అత్యంత ఆసక్తికరమైన సినిమా ఇది అని.. పక్కా నేషనల్ అవార్డు వస్తుంది అంటూ పలువురు జనాలు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో విశ్వక్ సేన్ అఘోరగా మెప్పించాడు . విశ్వక్ సేన్ అంటే చాలామంది యంగ్ నాటి సీన్స్ ఇష్టపడతారు . మరి ఈ సినిమాలో అలాంటి సీన్స్ లేకపోవడం విశ్వక్ సేన్ ఫాన్స్ కు కొంచెం డిసప్పాయింట్మెంట్ కలిగించింది .కానీ స్టోరీ మాత్రం ఎక్కడ బ్రేక్ లేకుండా ఆద్యంతం ఆసక్తికరంగా ముందుకెళ్ళింది. దీంతో కొంతమంది విశ్వక్ సేన్ ఫ్యాన్స్ ఈ సినిమాని పెద్దగా లైక్ చేయలేకపోతున్నారు. విశ్వక్ సేన్ అంటే యంగ్ నాటి కుర్రాడిలానే కనిపించాలి అంటూ చెప్పుకొస్తున్నారు . మొత్తానికి గామి సినిమా విశ్వక్ సేన్ కు కొన్ని పాజిటివ్ కొన్ని నెగటివ్ కామెంట్స్ తీసుకొచ్చి పెట్టింది..!!