ప్రభాస్-కీర్తి సురేష్ కాంబోలో మిస్సయిన సినిమా ఏంటో తెలిస్తే జుట్టు పీక్కుంటారు..దరిద్రం అంటే ఇదే..!

ఫ్యాన్స్ కి కొత్త కొత్త కాంబోలు చూడడం ఇష్టంగా ఉంటుంది . ఒకే హీరో ఎప్పుడు ఒకే హీరోయిన్ తో రొమాన్స్ చేస్తే ఎవరు చూడాలి అనుకుంటారు..?? ఫాన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ లో ఆలోచించడం మొదలుపెట్టారు . అయితే చాలామంది డార్లింగ్ ఫాన్స్ ప్రభాస్ పక్కన హీరోయిన్ కీర్తి సురేష్ స్క్రీన్ షేర్ చేసుకుంటే చూడాలి అంటూ ఆశపడ్డారు .

మహానటి సినిమా తర్వాత ఆ కోరికలు ఎక్కువైపోయాయి . అయితే ప్రభాస్ – కీర్తి సురేష్ కాంబోలో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా రాలేదు . కానీ కొంతమంది డైరెక్టర్స్ మాత్రం వీళ్ళ కాంబో సెట్ చేయడానికి చూశారట. ఆలా మిస్ అయిన సినిమానే “ది రాజా సాబ్”.. నిజానికి మారుతి ఈ సినిమాలో వన్ ఆఫ్ ద హీరోయిన్ గా కీర్తి సురేష్ ని అనుకున్నారట . కానీ కీర్తి సురేష్ సెకండ్ హీరోయిన్ గా చేయను అంటూ చెప్పడంతో ఆయన ఈ సినిమాలో ఆమె పాత్రను తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

ఒకవేళ ఫస్ట్ హీరోయిన్ క్యారెక్టర్ అయి ఉంటే కీర్తి సురేష్ చేసేదేమో కానీ అప్పటికే మరొక హీరోయిన్ కి ఫస్ట్ హీరోయిన్ ఛాన్స్ ఇవ్వడంతో మారుతి తాను ఇష్టపడిన కీర్తి సురేష్ కు అవకాశం ఇవ్వలేకపోయాడు అన్న ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఈ వార్త బాగా వైరల్ గా మారింది . చూద్దాం మరి ఫ్యూచర్లో కీర్తి సురేష్ ప్రభాస్ కాంబో ఎప్పుడు వర్కౌట్ అవుతుందో..??