రామ్ చరణ్ నటించిన అన్ని సినిమాలలోకి ఉపాసన ఫేవరెట్ మూవీ ఏంటో తెలుసా..? టూ నాటి వైఫ్..!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా ఎంతమంది హీరోయిన్లు ఉన్నా ఎంతమంది డైరెక్టర్లు ఉన్న ఎన్నెన్ని సినిమాలు వచ్చిన మనకంటూ స్పెషల్ గా ఇంట్రెస్టింగ్ గా కొన్ని మూవీస్ నచ్చుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా మన ఫేవరెట్ హీరో వందల సినిమాలో నటించిన అందులో ఒకటో రెండో బాగా బాగా లైక్ చేస్తూ ఉంటాం. ప్రజెంట్ ఇప్పుడు మెగా ఫ్యామిలీకి సంబంధించిన అలాంటి ఒక వార్త బాగా వైరల్ గా మారింది .

ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రామ్ చరణ్ ..రీసెంట్గా తన ట్యాగ్ను గ్లోబల్ స్టార్ గా మార్చుకున్న విషయం అందరికీ తెలిసిందే . ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న చరణ్ ప్రజెంట్ బుచ్చిబాబు సనా డైరెక్ట్ చేస్తున్న సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు .. ఇలాంటి క్రమంలోనే ఉపాసనకు రాంచరణ్ నటించిన అన్ని సినిమాలలోకి ది మోస్ట్ ఫేవరెట్ సినిమా ఏంటి అనే విషయం బాగా ట్రెండ్ అవుతుంది.

అయితే ఉపాసనకు రాంచరణ్ నటించిన అన్ని సినిమాలు ఇష్టమని ..కానీ అన్ని సినిమాలలోకి మగధీర – రంగస్థలం సినిమాలు అంటే చాలా చాలా ఇష్టమని .. ఆ రెండు సినిమాలలో చరణ్ పెర్ఫార్మన్స్ వేరే లెవెల్ లో ఉంటుంది అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకు వచ్చింది . అంతేకాదు రంగస్థలం సినిమాలో మాత్రం రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ ఎన్నిసార్లు చూసినా ఆమెకు తనివి తీరదట . ఆమెకు ఏమాత్రం సమయం ఉన్న రంగస్థలం సినిమాను ఎక్కువగా చూస్తుందట..!