నాగచైతన్య విషయంలో అమలా చేసిన తప్పే ..అఖిల్ లైఫ్ కి శాపంగా మారిందా..?

అక్కినేని నాగచైతన్య విషయంలో హీరోయిన్ అమలా చేసిన తప్పే అఖిల్ లైఫ్ కి శాపంగా మారింది అన్న న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో ఎక్కువగా ట్రెండ్ అవుతుంది. ఇది ఎంతవరకు నిజం అనేది తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ ప్రచారం రూపం అందుకుంది. మొదటి నుంచి అమలా అంటే కొంతమంది జనాలకు నెగిటివ్ ఫీలింగ్ ఉంటుంది . అక్కినేని నాగచైతన్య లైఫ్ స్పాయిల్ అవ్వడానికి కారణం అమలానే అంటూ ప్రచారం జరిగింది .

అంతేకాదు సమంత – నాగచైతన్య విడిపోవడానికి కారణం కూడా అమలానే అంటూ అప్పట్లో బాగా వార్తలు వినిపించాయి. అయితే మొదటి నుంచి నాగచైతన్య కంటే ఎక్కువగా అఖిల్ కే ప్రిఫరెన్స్ ఇచ్చేది అమలా అని ..ఆ కారణంగానే నాగచైతన్య తెలిసి తెలియక కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు అని ..నాగచైతన్య తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడు అని తెలిసినా కూడా అమల వాటిల్ని వేలెత్తి చూపించేది కాదు అని ..

తన లైఫ్ తన ఇష్టం అంటూ లైట్ గా వదిలేసింది అని ..ఆమె నాగచైతన్య విషయంలో అంత లైట్ గా ఉండబట్టే అఖిల్ కూడా తన లైఫ్ కి సంబంధించిన నిర్ణయాలు తానే తీసుకునే విధంగా మారిపోయాడు అని.. నాగచైతన్య మెచ్యూరిటీ లెవెల్స్ బాగుండి నాగచైతన్య కాస్తో కూస్తో ఇండస్ట్రీలో హిట్టు అందుకున్నాడు అని.. కానీ అఖిల్ పరిస్థితి మాత్రం దారుణంగా మారిపోయింది అని.. తెలిసి చేసిందో తెలియక చేసిందో నాగచైతన్య విషయంలో అమలా తీసుకున్న కొన్ని నిర్ణయాలు అవి పరోక్షకంగా అఖిల్ లైఫ్ కు శాపంగా మారాయి అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు . ఈ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది..!!