ప్రభాస్ ” కల్కి ” పై దిమ్మతిరిగే అప్డేట్ ఇదే..!

రెబల్ స్టార్ ప్రభాస్ గురించి మనందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నాడు ప్రభాస్. రీసెంట్ గా సలార్ మూవీ తో ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ కల్కి సినిమాలో నటిస్తున్నాడు. ప్రభాస్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో రాబోతున్న కల్కి 2898AD మూవీ పై ప్రభాస్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.

ప్రస్తుతం ప్రభాస్ దిశాపటానిపై ఒక పాటను చిత్రీకరిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది.ఇక మిగిలిన సన్నివేశాల షూటింగ్ ను కూడా పూర్తి చేయడానికి చిత్ర బృందం త్వరలో భారతదేశానికి తిరిగి రానుంది. ఇక ఈ మూవీలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

ఈ సినిమాలో కమల్ హాసన్, పశుపతి రాజేంద్ర ప్రసాద్ నటిస్తున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది..ఈ సినిమా తెరకెక్కించడానికి నాగ్ అశ్విన్ అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు.వైజయంతి మూవీస్ పతాకం పై అశ్వనీదత్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్వహించనున్నారు.సంతోష్ నారాయణన్ సంగీత దర్శకత్వం అందిస్తున్నాడు.ఈ సినిమా మే 9, 2024న థియేటర్ లో విడుదల అవ్వబోతుంది.