ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన సినిమాలతో హీరోలుగా మారిన స్టార్స్ వీళ్లే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటవారసుడుగా ఎంట్రీ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. చాలా తక్కువ టైంలో స్టార్ హీరోగా ఎదిగిన ఈ యంగ్ టైగర్.. తాతకు తగ్గ మనవడిగా నటనలో తనకంటూ ప్రత్యేకమైన పేరు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం గ్లోబల్ స్టార్‌గా దూసుకుపోతున్న తారక్.. తన కెరీర్ స్టార్టింగ్ నుంచే కథల విషయంలో చాలా జాగ్రత్తగా డెసిషన్ తీసుకునేవాడు. అలా ఎన్టీఆర్ మొదట్లో చాలా సినిమాలు రిజెక్ట్ చేశాడు. సరిగ్గా జడ్జిమెంట్ చేయలేక తాను సినిమాకు సెట్ అవ్వని ఉద్దేశంతో ఎన్నో సినిమాలను రిజెక్ట్ చేశాడు. అందులో కొన్ని సినిమాలను చేసి చాలామంది స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇంతకీ ఆ సినిమాలు ఏంటో.. ఆ హీరోలు ఎవరో.. ఒకసారి తెలుసుకుందాం. మొదట వి.వి. వినాయక్ డైరెక్షన్‌లో వచ్చిన దిల్ సినిమాను మొదట ఎన్టీఆర్‌నే అనుకున్నారట. అయితే ఆ కథకు తాను సెట్ అవనని ఎన్టీఆర్ ఆ సినిమాను రిజెక్ట్ చేశాడు. ఇక ఈ సినిమాలో యంగ్ హీరో నితిన్ నటించ‌ స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు. తర్వాత బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో రవితేజ హీరోగా తెరకెక్కిన భద్రా మూవీలో కూడా ఎన్టీఆర్ చేయాల్సిందట. కానీ ఏవో కారణాలతో దాన్ని కూడా రిజెక్ట్ చేశాడు తారక్. దీంతో రవితేజ ఈ సినిమాలో హీరోగా నటించిన మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ మూవీ తో ర‌వితేజా కెరీర్ ట‌ర్న్ అయ్యింది.

ఇక సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఆర్య సినిమాల్లో కూడా మొదట ఎన్టీఆర్‌నే అప్రోచ్ అయ్యారట. కానీ ఎన్టీఆర్ దానిని మరి సాఫ్ట్ స్టోరీలా ఉందనే ఉద్దేశంతో రిజెక్ట్ చేసాడట. దానివల్ల ఆ సినిమాని అల్లు అర్జున్ న‌టించి మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇలా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన సినిమాలు సూపర్ హిట్‌లుగా నిలిచి వారి కెరీర్‌ను మలుపు తిప్పాయి. అయితే ఈ మూడు సినిమాలను ఎన్టీఆర్ చేసి ఉంటే ఆయన రేంజ్ అప్ప‌ట్లోనే మరోలా ఉండేదని ట్రేడ్ వర్గాలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి.