“టిల్లు స్క్వేర్” సినిమాలో హీరోయిన్గా అవకాశం వచ్చిన ..మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. దరిద్రం అంటే ఇదే..!

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే టిల్లు స్క్వేర్.. టిల్లు స్క్వేర్ .. టిల్లు స్క్వేర్ అన్న పేరే మారుమ్రోగిపోతుంది . నాగ వంశీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించి రామ్ దర్శకత్వంలో హీరోగా సిద్దు జొన్నలగడ్డ .. హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్ నటించిన సినిమానే.. ఈ టిల్లు స్క్వేర్. గతంలో సూపర్ డూపర్ హిట్ అయిన డీజే టిల్లు సినిమాకి ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది . ఈ సినిమా కోసం అభిమానులు ఎంతలా వెయిట్ చేశారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఒకటి కాదు రెండు కాదు ఈ సినిమా ఎన్నో రికార్డ్స్ కొల్లగొట్టడానికి సిద్ధంగా ఉంది అన్న విషయం సినిమా రిలీజ్ అయ్యాకే అర్థమైంది . నిజానికి ఈ సినిమాలో హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్ కంటే ముందే శ్రీలీల ను ఫిక్స్ చేసుకున్నారు మేకర్స్. కానీ ఆమెకు సినిమాలో ఇంత బోల్డ్ పర్ఫామెన్స్ ఉంది అన్న విషయం మాత్రం చెప్పలేదు . డి జె టిల్లు సినిమా చూసిన తర్వాత ఆ సినిమాకి సీక్వెల్ అంటే కాస్తో కూస్తో.. బోల్డ్ పర్ఫామెన్స్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తారు.

కానీ ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఒకటి రెండు కాదు ఏకంగా డబల్ స్థాయిలో టిల్లు గాడితో రొమాన్స్ చేయాలి రాధిక అన్న విషయం అభిమానులకు అర్థమైంది . అంతేకాదు ఇది ఆలస్యంగా తెలుసుకున్న శ్రీ లీల మేకర్స్ ఇచ్చిన అడ్వాన్స్ డబ్బులు వెనక్కి ఇచ్చేసి మరి ఈ సినిమా నుంచి తప్పుకుందట . ఈ సినిమా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయింది . ప్రెసెంట్ శ్రీలీల చేతిలో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు లేవు ..అన్ని పాత కమిట్ అయినా సినిమాలే .. కాని కొత్తగా ఏది కమిట్ అవ్వలేదు. ఈ సినిమా హిట్ అవడంతో మంచి సినిమా మిస్ చేసుకున్నాను అంటూ బాధపడిపోతుందట శ్రీ లీల..!!