అక్కడ ఇండస్ట్రీపై కన్నేసిన శ్రీ లీల.. ఛాన్స్ వస్తే సత్తా చాటుతానంటున క్రేజీ బ్యూటీ..

కే.రాఘవేంద్ర డైరెక్షన్‌లో తరికెక్కిన పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం అయింది శ్రీలీల. మొదటి సినిమా ఊహించిన రేంజ్‌లో సక్సెస్ కాకపోయినా.. ఈమె డ్యాన్స్‌కు మంచి మార్కులు కొట్టేసింది. ఈ మూవీలో అందంతో, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిన్న‌ది తర్వాత మాస్ మహారాజు రవితేజ సరసన ధమాకా సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హీట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా తర్వాత వరుసగా టాలీవుడ్ స్టార్ హీరోలతో నటించే అవకాశాలను అందుకుని క్రేజీ బ్యూటీగా మారిపోయింది. అయితే దాదాపు అర డజన్‌కు పైగా సినిమాల్లో నటించినా.. బాలయ్యతో నటించిన భగవంత్ కేసరి తప్ప మరి ఏ సినిమా ఊహించిన రేంజ్ లో సక్సెస్ కాలేదు.

దీంతో ప్రస్తుతం శ్రీ లీలకు అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్స్ అంతా సక్సెస్ రేట్‌ కాస్త తగ్గింది అనిపిస్తే చాలు పక్క ఇండస్ట్రీలపై కన్ను వేసి మెల్లగా మాకం అక్కడికి మార్చేసి.. అవకాశాల కోసం అక్కడ ప్రయత్నిస్తూ సక్సెస్ సాధిస్తున్నారు. అలానే ప్రస్తుతం శ్రీ లీలా కూడా మరో ఇండస్ట్రీకి చెకేయాలని ప్లాన్ చేస్తుంది. అక్కడ కూడా నాలుగైదు సినిమాలు చేసి మరో నలుగురు స్టార్ హీరోలతో మెరిసి నాలుగు డబ్బులు వెనకేసుకోవాలని ఆలోచనలో ఉందట‌. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం శ్రీ లీల కోలీవుడ్‌కు షిప్ట్ అవ్వాలని ప్లాన్స్ చేస్తుందట.

అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుందని తెలుస్తుంది. ఒకసారి టాలీవుడ్‌లో అవకాశం వస్తే.. తన నటనతో సత్తా చాటి సక్సెస్ సాధించాలని కసితో ఉందట ఈ ముద్దుగుమ్మ. శ్రీలలకు టాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె అందం, అభినయానికి కుర్ర కారు బాగా కనెక్ట్ అయ్యారు. ఇక ప్రస్తుతం ఈ న్యూస్ నెటింట‌ వైరల్ అవడంతో టాలీవుడ్ లోనూ మరోసారి అవకాశం ఇస్తే తానేంటో ప్రూవ్ చేసుకుంటుందని.. ఆమె అనుకున్నట్టే కోలీవుడ్ లో కూడా క్రేజీ ఆఫర్లు దక్కించుకొని సక్సెస్ సాధించాలంటూ ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు