మహేష్ బాబు చేత అలాంటి పని చేయించబోతున్న రాజమౌళి.. ఫ్యాన్స్ ఊరుకుంటారా..?

ఇప్పటివరకు మనం మహేష్ బాబుని ఎక్కడ కూడా భారీ భారీ రిస్కీ షాట్స్ లో నటించిన మూమెంట్స్ ని మూవీస్ ని చూడలేదు . మహేష్ బాబు అంటే చాలా సింపుల్ సబ్జెక్టు చూస్ చేసుకుంటాడు . ఫ్యామిలీ ఆడియన్స్ కూడా అట్రాక్ట్ అయ్యే విధంగా పలు సీన్స్ లో నటించగలడు . ఇంతవరకే తెలుసు .. భారీ అడ్వెంచర్స్ సినిమా అంటే ఆయన ఖాతాలో ఒక్కటి కూడా లేదు. ఫస్ట్ టైం అలాంటి జోనర్ని టచ్ చేయతున్నాడు మహేష్ బాబు .

రాజమౌళి దర్శకత్వంలో – మహేష్ బాబు ఒక సినిమాకి కమిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని ధీమా వ్యక్తం చేస్తున్నారు జనాలు . అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా భారీ అడ్వెంచర్స్ మూవీగా తెరకెక్కబోతుందట. అంతేకాదు ఈ సినిమాలో డూప్ లేకుండానే మహేష్ బాబు చేత రిస్క్ షాట్స్ తీయించబోతున్నాడట .

రాజమౌళి భారీ భారీ స్టాంట్స్ కూడా చేయించబోతున్నాడట . గతంలో మహేష్ బాబు పలు అడ్వర్టైజ్మెంట్లు అలాంటి స్టంట్స్ చేసిన అదంతా డూపే చేసే వాళ్ళు.. కానీ ఇప్పుడు రియల్ గా మహేష్ బాబును పెట్టి రాజమౌళి రిస్కీ షాట్స్ ప్లాన్ చేస్తే .. అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అని చెప్పలేం . కచ్చితంగా కొన్ని గాయాలు అవ్వచ్చు .. కొన్నిసార్లు అంతకుమించింది కూడా జరగొచ్చు .

మరి రాజమౌళి ఎందుకు అంత రిస్క్ తీసుకుంటున్నారు అనేది అర్థం కావడం లేదు. ఇది తెలుసుకున్న ఫ్యాన్స్ మండిపడుతున్నారు . పోయి పోయి మా మహేష్ బాబు పైనే నువ్వు ప్రయోగాలు చేస్తున్నావా..? అంటూ ఫైర్ అవుతున్నారు . మరికొందరు అసలు సిసలైన మహేష్ బాబు లోని హీరోయిజాన్ని మనం ఇప్పుడే చూడబోతున్నాం.. ఆల్ ద బెస్ట్ మహేష్ – జక్కన్న అంటూ ఓ రేంజ్ లో అప్రిషియేట్ చేస్తున్నారు..!!