మిస్ వరల్డ్ ఫైనల్ రేసులో దుమ్ము రేపుతున్న ఇండియన్ బ్యూటీ.. డ్యాన్స్ ఇరగదీసిందిగా..

ప్రస్తుతం భారత్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. సుమారు 28 ఏళ్ల తర్వాత 71వ మిస్ వరల్డ్ ఎడిషన్‌కు భారత్ ఆతిథ్యమిచ్చింది. ఫిబ్రవరి 18 ను ప్రారంభమైన ఈ ఈవెంట్ మార్చి 9 వరకు కొనసాగుతుంది. ఇక ఈ 71వ మిస్ వరల్డ్ కాంపిటీషన్లో 130 కి పైగా దేశాల నుంచి ఎంతోమంది పోటీదారులు పాల్గొన్నారు. ఈ పోటీలో సందడి చేసిన ప్రతి ఒక‌రు తమ అందంతో పాటు టాలెంట్‌ కూడా ప్రదర్శిస్తూ హోరాహోరీగా తలపడ్డారు. భారత్ నుంచి కన్నడ బ్యూటీ సినీ శెట్టి మిస్ వరల్డ్ పోటీ కోసం బరిలో దిగింది. ప్రస్తుతం ఆమె ఫైనల్ రౌండ్ కు చేరుకుంది. టాప్ 20 లో ఉన్న ఈ ముద్దుగుమ్మ.. మిస్ వరల్డ్ పోటీలో దుమ్మురేపుతుంది. ఎలాగైనా టైటిల్ ని గెలుచుకుంటుందని నమ్మకం ప్రేక్షకుల్లో మొదలైంది.

ఇక 1994 మిస్ వరల్డ్ టైటిల్ లు గెలుచుకున్న ఐశ్వర్య భారతీయుల్లో ఎలాంటి చెరగని ముద్ర వేసుకుందో అందరికీ తెలిసు. ఆ కిరీటాన్ని ఆమె అందుకుని ఇప్పటికీ మూడు దశాబ్దాలు అయింది. ఇక ఈ సందర్భంగా 2024 మిస్ వరల్డ్ టాలెంట్ ఫైనల్స్ రౌండ్లో ఐశ్వర్యరాయ్ హిట్ సాంగ్స్ అన్నిటికీ సినీ శెట్టి డాన్స్‌తో అద‌ర‌గొట్టింది. హమ్ దిల్ దే చుక్ స‌నామ్ సినిమా నుంచి నింబుడా పాటతో తాల్, బంటీ అవుర్ బబ్లీ సినిమాలో హిట్ సాంగ్ లకు డ్యాన్స్ తో దుమ్మురేపింది. అయితే ఈ పాటలను ఐశ్వర్యకు అంకితం చేస్తున్నట్లు వివరించింది. ప్రస్తుతం ఆ వీడియోలు నెట్టింట‌ తెగ వైరల్ గా మారుతున్నాయి.

ఐశ్వర్య వారసత్వానికి గుర్తుగా ఇండియ‌న్ సైన్టిఫిక్‌, బాలీవుడ్ ట్రెడిషనల్ డ్యాన్స్‌ల‌ కలయికతో సినీ శెట్టి డ్యాన్స్ అదరగొట్టింది. దీంతో భారతీయులంతా ఆమె ప్రతిభను మెచ్చుకుంటున్నారు. ఇక ముంబైలో ఈ నెల 8న జరిగన్నున‌ మిస్ వరల్డ్ 2024 ఫైనల్ టెస్ట్ పై అందరి దృష్టి ఉంది. ఈ ఫైనల్ పోటీ రాత్రి 7:30 నుంచి 10 గంటల వరకు లైవ్ లో చూడవచ్చు. 2017 లో మనుషి చిల్లర మిస్ వ‌రల్డ్ టైటిల్ దక్కించుకుంది. 2024లో సినీ శెట్టి కచ్చితంగా భారత్ కు మరోసారి సక్సెస్ అందిస్తుందని ఆడియన్స్ అంతా నమ్ముతున్నారు.