కామెడీ, రొమాన్స్ తో పాటు యాక్షన్ సీన్స్ లోనూ అదరగొట్టిన ఫ్యామిలీ స్టార్.. ట్రైలర్ అదుర్స్..!!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలో నటిస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి గట్టిగా హిట్ కొట్టే ప్రయత్నాల్లో ఉన్నాడు రౌడీ హీరో. గతంలో బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్‌తో చేతులు కలిపిన యంగ్ హీరో.. ఫ్యామిలీ స్టార్‌గా ప్రేక్షకులను అల్లరించనున్నాడు. 2019లో రిలీజ్ అయినా రొమాంటిక్ లవ్ ఎంటర్టైన గీత గోవిందం బాక్స్ ఆఫీస్ లో ఏ రేంజ్ లో ఆకట్టుకుందో.. ఎలాంటి కలెక్షన్లను రాబట్టిందో తెలిసిందే. విజ‌య్ దేవ‌ర‌కొండ‌ ఇమేజ్ ను ఈ సినిమా రెట్టింపు చేసింది.

అయితే గీత గోవిందం డైరెక్టర్ మరోసారి విజయ్ దేవరకొండ తో ఫామిలీ స్టార్ తెర‌కెక్కిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజై ప్రేక్షకుల మనసులను దోచింది. లవ్, రొమాన్స్ తో పాటు యాక్షన్ సన్నివేశాలతోను ఆకట్టుకున్నాడు దేవరకొండ. భారీ యాక్షన్ ఎపిసోడ్‌లో పాల్గొని కనిపించాడు. ఇక పరశురాం తన మార్క్ రొమాంటిక్ సీన్స్ ను రూపొందించాడు. మృణాల్‌, విజయ్ దేవరకొండ కాంబినేషన్ సీన్స్ ప్రేక్షకులను పిక్స్ లెవెల్ లో ఆకట్టుకున్నాయనడంలో సందేహం లేదు. ఇక విజయ్‌లో రెండు షేడ్స్‌ కనిపించనున్నాయి. ఫారిన్ ఎపిసోడ్స్ చాలా రిచ్ గా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక హీరోయిన్ మృణాల్‌ ఠాగూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే వదిగిపోయి.. నటించే ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాలో నటించడంతో సినిమాకు మరింత హైప్‌ పెరిగింది. మొత్తంగా ఫ్యామిలీ స్టార్‌ మూవీని యూత్ అంతా ఇష్టపడే విధంగా రూపొందించాడు డైరెక్టర్ పరుశురాం. ఇక గీత గోవిందం తర్వాత విజయ్ దేవరకొండ సరైన హిట్‌ తన ఖాతాలో వేసుకోలేకపోయాడు. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ హిట్ దాహం తీరేలా అనిపిస్తుంది. ఇక ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ రిలీజ్ చేయడం తో సినిమాపై ప్రేక్షకుల్లో మరింత హైప్ పెరిగింది.