బ్రేకింగ్.. హీరో నవీన్ పోలిశెట్టి కి రోడ్డు ప్రమాదం.. గాయాల పాలైన యంగ్ హీరో..?!

టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలీశెట్టికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చేసినవి కొద్ది సినిమాలైనా క్రేజీ హీరోగా పాపులర్ అయిన.. ఈ యంగ్ హీరో అతి తక్కువ టైంలోనే ప్రామిసింగ్ హీరోగా ఎదిగాడు. ఇతనితో సినిమా తీస్తే మినిమం గ్యారంటీ అనే నమ్మకం ప్రేక్షకులోను, నిర్మాతల్లోనూ ఏర్పడేలా చేశాడు. మొదట ఏజెంట్ సాయి శ్రీనివాస్ అత్రేయ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నవీన్ పోలిశెట్టి.. తర్వాత జాతి రత్నాలు, మిస్‌శెట్టి మిస్టర్‌పోలీశెట్టి సినిమాలతో వరసగా సూపర్ హిట్లను అందుకున్నాడు. ఇప్పుడు అతనితో సినిమాలు చేయడానికి దాదాపు టాలీవుడ్‌ నిర్మాణ సంస్థలన్నీ సిద్ధంగా ఉన్నాయి.

కానీ నవీన్ పోలీశెట్టి మాత్రం హడావిడి సినిమాలు చేయనని ఫిక్సయ్యాడు. ఆచితూచి కథలను ఎంచుకునే మార్గంలో అడుగులు వేస్తున్నాడు. సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో.. అనగనగా ఒక రాజు అనే సినిమాలో నటిస్తున్నట్టు గ‌తంలో నవీన్ ప్రకటించాడు. కానీ అది ఇంకా జెట్స్‌ఫైకి రాలేదు. డైరెక్టర్ చెప్పిన స్క్రిప్ట్ నచ్చకపోవడంతో నవీన్‌ ఆ సినిమాను ఇంకా మొదలుపెట్టలేదని కొన్ని కామెంట్లు నెట్ వైరల్ గా మారాయి. అలాగే షైన్ స్క్రీన్‌ బ్యానర్ లో కూడా ఓ సినిమా చేయాల్సి ఉంది.

ఇలాంటి క్రమంలో నవీన్ పోలిశెట్టి ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యాడని వార్తలు వైరల్ గా మారాయి. బైక్ యాక్సిడెంట్ అయింద‌ని తెలుస్తుంది. రెండు రోజుల క్రితం ఆయన బైక్ స్కిడ్ అయ్యి కింద పడ్డారని.. దీంతో నవీన్ చెయ్యి ఫ్రాక్చర్ అయ్యిందని తెలుస్తుంది. ప్రస్తుతం నవీన్ అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడట. కోలుకోవడానికి కనీసం మూడు నెలలు వరకు టైం పడుతుందని సమాచారం. అయితే ఇందులో నిజం ఎంతుందో నవీన్ పోలిశెట్టి స్పందిస్తే గాని తెలియదు.