రామ్ చరణ్ బర్త్ డే వేడుకల్లో చిరు, మోహన్ బాబు గొడవలపై మంచు మనోజ్ షాకింగ్ కామెంట్స్..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ నిన్న ఘనంగా జరిగిన సంగ‌తి తెలిసిందే. మెగా ఫాన్స్ ఆధ్వర్యంలో చరణ్ బర్త్ డే వేడుకలు కోసం గ్రాండ్ ఈవెంట్లు ఏర్పాటు చేశారు. ఎంతోమంది ప్రముఖులు హాజరై సందడి చేశారు. మంచు ఫ్యామిలీ నుంచి మంచు మనోజ్ గెస్ట్‌గా హాజ‌రై సంద‌డి చేశాడు. తన ప్రసంగంతో అందరిని ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. చెన్నైలో ఉన్నప్పుడు మా ఇళ్ళు పక్కపక్కనే ఉండేవని.. దాంతో అందరం కలిసి మెలిసి పెరిగామంటూ వివరించాడు. ఇక చిన్నప్పటి ఫ్రెండ్స్ ఎవరిని రాంచరణ్ ఇప్పటికీ మర్చిపోలేదని.. అందరిని గుర్తు పెట్టుకున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు.

ఎవరైనా ఆపదలో ఉంటే చరణ్ వెంటనే ఆదుకుంటాడని.. ఆ గుణం చాలా తక్కువ మందిలో ఉంటుందంటూ మనోజ్ వివరించాడు. దుబాయ్‌లో తెలుగు ఆడపిల్లలకి కష్టం వచ్చిందని.. ఇమిగ్రేషన్ ఫెయిల్ కావడంతో ఫ్యామిలీ మొత్తాన్ని లాక్ చేశారంటూ వివరించాడు. నాకు వీలైన వరకు సాయం చేశానని.. ఇంకా కావాలి ఎవరిని అడిగితే బాగుంటుందని ఆలోచిస్తుండగా చరణ్ గుర్తుకు వచ్చాడని.. వెంటనే ఫోన్ చేసి విషయం చెప్పా.. రూ.5 లక్షలు కావాలన్నా.. అకౌంట్ నెంబర్ పంపు బాబాయ్ వెంటనే వేసేస్తా.. అని క్షణాల్లో అమౌంట్‌ ఇచ్చాడని మంచు మనోజ్ వివరించాడు. ఈ క్రమంలో మంచు, మెగా ఫ్యామిలీ మధ్య విభేదాల గురించి మనోజ్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

నేను ఈవెంట్ కు వస్తూ ఉంటే కొందరు అడిగారు. మీ నాన్న మోహన్ బాబు, వాళ్ళ నాన్న చిరంజీవి ఎప్పుడు గొడవపడతారు.. మళ్ళీ కలిసి పోతారు. కానీ నువ్వు మాత్రం చరణ్‌తో స్నేహం గానే ఉన్నావేంటి అంటూ ప్రశ్నించారు. నేను ఒక్కటే చెప్తా భార్యా,భర్తలు గొడవ పడుతుంటారు.. కలిసిపోతారు. దాని గురించి బయట వాళ్ళు మాట్లాడరు. అలానే చిరంజీవి గారు, మోహన్ బాబు గారు క్యూట్ టామ్ అండ్ జెర్రీ మనం మాట్లాడకూడదు అంటూ మెగా ఫ్యామిలీ.. మంచు ఫ్యామిలీ మద్యలో ఉన్న రిలేషన్షిప్.. ఫిష్ అండ్ వాటర్ లా ఉంటుంది.. ఫిష్ అండ్ ఫిషర్ మాన్ లా ఉండకూడదు అంటూ డైలాగ్ చెప్పి ఆకట్టుకున్నాడు.