మహేష్, రాజమౌళి మెచ్చిన ఆ హిట్ మూవీ.. ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?!

మలయాళ ఇండస్ట్రీలో ఫిబ్రవరి 9న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రిలీజ్ అయిన ప్రేమలు అక్కడ భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను అందుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై రూ.100 కోట్లు సాధించి రికార్డును క్రియేట్ చేసింది. తెలుగులో కూడా ప్రేమలు అనే పేరుతో తాజాగా ఈ సినిమాను థియేటర్స్ లోకి రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా సూపర్ హిట్ టాక్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైన‌ర్‌గా తెరకెక్కిన ఈ సినిమా యూత్‌కు బాగా కనెక్ట్ అవ్వడంతో.. ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. గిరీష్ ఎడి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో నస్లైన్ కె. గపూర్, మమిత బైజు జంటగా నటించి మెప్పించారు. ఇక సినిమాను తెలుగులో రాజమౌళి తనయుడు ఎస్.ఎస్. కార్తికేయన్ డిస్ట్రిబ్యూట్ చేసి మంచి సక్సెస్ సాధించాడు.

ఇప్పటికే ఈ సినిమాను చూసిన మహేష్ బాబు దంప‌తుల‌తో పాటు.. రాజమౌళి ఈ సినిమా పై ప్ర‌స్స‌లు కురిపించారు. మహేష్ బాబు అయితే ఈ సినిమాను చూసినంత సేపు నవ్వుకుంటూనే ఉన్నానని.. అంతగా నవ్వి చాలా రోజులు అయింది అంటూ రివ్యూ ఇచ్చాడు. ఇక దీంతో ఈ సినిమాకు మరింత హైప్‌ పెరిగింది. ఇలా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కాసుల‌ వర్షం కురిపిస్తున్న ఈ సినిమా త్వరలోనే ఓటీటీ వేదికపై ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేమలు మూవీ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుందట. మార్చి 29 నుంచి సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.

మలయాళంతోపాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. మలయాళంలో రిలీజై ఇప్పటికే 30 రోజులు దాటిన ఈ సినిమాను.. మార్చి మొదటి వారంలోనే ఓటీటీలోకి రిలీజ్ చేయాలని డిస్నీ హాట్ స్టార్ ప్లాన్ చేసింది. కానీ ప్రేమలు సినిమాను ఎస్. ఎస్. కార్తికేయ తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేయడంతో తెలుగు వర్షన్ మార్చ్ 8న ధియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాగే తమిళ్ వర్షన్ మార్చి 15న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ కారణాలతోనే ఓటీటీ రిలీజ్‌ను కాస్త ఆలస్యం చేస్తున్నట్లు సమాచారం. మార్చి 29 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ దాదాపు ఖాయమని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.