చేతినిండా సినిమాలతో బిజీ అయిపోతున్న నేషనల్ క్రష్.. లైన్ అప్ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోద్ది..

సినీ ఇండస్ట్రీలో ఆల్ టైం యంగ్ బ్యూటీగా మెరిసిపోయే హీరోయిన్లలో రష్మిక మందన ఒకటి. ఆమె క్యూట్ లుక్స్, ఆకట్టుకునే ఎక్స్ప్రెషన్స్ తో ప్రేక్షకులను మెప్పిస్తుంది. లుక్ తో పాటు అభినయంతోను ఆకట్టుకునే ఈ చిన్నది.. సినిమా అవకాశాలను కూడా అదే రేంజ్ లో అందుకుంటుంది. ఇక ఆమె నటించిన అన్ని సినిమాలు కూడా రష్మికకు కలిసొస్తున్నాయి. ప్రతి ఏడాది ఏదో ఒక సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. కేవలం పెద్ద సినిమాల్లో మాత్రమే కాకుండా.. మంచి కంటెంట్ ఉన్న మీడియం బడ్జెట్ సినిమాల‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఓ విధంగా చెప్పాలంటే ఆమె ఎంచుకునే కథలు కూడా ఆమె సక్సెస్ కు ప్రధాన కారణం.

ఇక ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలలోను అమె క్రేజ్‌ను పెంచుకునేందుకు అడుగులు వేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. బాలీవుడ్ లో కూడా చాలా తొందరగానే సక్సెస్ సాధించి పాన్ ఇండియన్ స్టార్ హీరోయిన్గా పాపులర్ అయిపోయింది. ఇక అప్పుడప్పుడు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో మెరుస్తున్న రష్మిక.. రీసెంట్ గా బ్యూటీ టోక్యో కి వెళ్లి సందడి చేసింది. అక్కడ ప్రధాన నగరాలను చుట్టేసిన ఈ చిన్నది తన అందమైన జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంది. ఆ ఫోటోల్లో రష్మిక చాలా గ్లామర్ అండ్ క్యూట్ లుక్స్ తో కనిపించింది. సింపుల్ డ్రెస్ లోను ఎంతో క్యూట్ గా దర్శనమిచ్చిన ఈ ముద్దుగుమ్మ.. స్టైలిష్ లుక్.. స్మైల్ తో నెటిజ‌న్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ఇక ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే ఈ రేంజ్ పాపులారిటీ దక్కించుకున్న ఏకైక హీరోయిన్ రష్మిక మందన.

ఇక గతంలో పుష్పతో పాన్ ఇండియా లెవెల్ బ్లాక్ బ‌స్టర్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమా సీక్వెల్‌లో కూడా నటిస్తుంది. ఈ సినిమా పైన ప్రేక్షకుల్లో భారీ హైప్‌ నెలకొంది. అలాగే బాలీవుడ్ లోనూ పలు సినిమాల్లో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. 2016లో కిర్రాక్ పార్టీ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. అంచలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం నేషనల్ క్రష్‌గా కుర్రాళ్ళ మదిని దోచుకుంటుంది. గతేడాది వారీసు, మిషన్ మజ్ను, యానిమల్ సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. యానిమల్ బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ కమర్షియల్ హిట్గా నిలవడంతో.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా కూడా ముద్ర వేసుకుంది. ఇక నెక్స్ట్ పుష్ప టు తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాతో పాటు రెయిన్బో అనే లేడీ ఓరియంటల్ సినిమాలను నటిస్తుంది. అలాగే ది గర్ల్ ఫ్రెండ్ అనే ఓ సినిమాలో కూడా రష్మిక నటిస్తుంది ఈ సినిమాలనే కాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు క్రేజ్ ను మరింతగా పెంచుకునే ప్రయత్నం చేస్తుంది రష్మిక. ఇక ఆమె ఫాలోవ‌ర్ల‌ సంఖ్య ఇటీవల ఒక్కసారిగా పెరిగిపోయింది. అలానే రష్మికకు ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్ లో వరుస‌ సినిమా ఆఫర్లు వస్తున్నాయి. మరోవైపు చిన్న సినిమా అయినా విజయ్ ఫ్యామిలీ స్టార్ సినిమాలోను రష్మిక మందన గెస్ట్ రోల్ లో కనిపిస్తుంది. ఇక కథల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ సెలెక్టివ్ గా సినిమాల్లో నటిస్తున్న రష్మిక కెరియర్ను ముందు ముందు ఏ రేంజ్ లో బిల్డ్ చేసుకుంటుందో వేచి చూడాలి.