వరుస ప్లాపుల తర్వాత భారీ సక్సెస్ లు అందుకున్న టాలీవుడ్ స్టార్ హీరోలు వీళ్ళే..!

సాధారణంగా ఏ ఇండస్ట్రీలో అయినా సినిమాలు వరుసనే ప్లాప్ అయితే ఆ హీరో స్టార్ హీరో అయినా సరే వారి కెరీర్ ప్రమాదంలో పడే అవకాశాలు ఉంటాయి. వరుస ప్లాపుల వల్ల ఇండస్ట్రీకి దూరమైన హీరోలు చాలామంది ఉన్నారు. అయితే కొంతమంది హీరోలు మాత్రం ఫ్లాపులు వచ్చిన కమ్‌బ్యాక్ ఇచ్చి మళ్లి స్టార్ హీరోలుగా వార్తల్లో నిలిచారు. అలాంటి హీరోలలో మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ముందు వ‌రుసలో ఉంటాడు. పోకిరి తర్వాత మహేష్ బాబు నటించిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాపులుగా నిలిచాయి. సైనికుడు, అతడు, ఖ‌లేజ ఇలా ఈ సినిమాలు అన్ని నిర్మాతలకు భారీ స్థాయిలో నష్టాలను తెచ్చిపెట్టాయి.

అదే టైంలో మహేష్ బాబు నటించిన దూకుడు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించి నిర్మాతలకు లాభాల వర్షం కురిపించింది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు నటించిన సినిమాలు అన్ని దాదాపు మంచి సక్సెస్ సాధించాయి. జూనియర్ ఎన్టీఆర్‌ను సైతం క‌త్తి సినిమా నుంచి రభస సినిమా వరకు అన్ని సినిమాలు నిరాశ ప‌రిచాయి. దీంతో ఎన్టీఆర్‌కు ఇక అవకాశాలు రావడం కష్టమే అనుకున్న టైంలో టెంపర్ సినిమాతో కమ్‌బ్యాక్ అయ్యాడు. ఈ సినిమాతో హిట్ సాధించిన తారక్ తర్వాత క‌థ‌ ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ సక్సెస్ సాధిస్తున్నాడు. అదేవిధంగా టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ సై సినిమా తర్వాత వరుసగా ఫ్లాప్ల‌ను ఎదుర్కొన్నాడు. ఇష్క్ సినిమాతో మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టాడు.

సాహో, రాదే శ్యామ్‌, ఆది పురుష్ లతో వరుసగా ప్లాప్ ఇచ్చిన ప్రభాస్.. ఇటీవల వచ్చిన స‌ల్లార్‌ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. ఇక కామెడీ హీరోగా క్రేజీ సంపాదించుకున్న అల్లరి నరేష్.. సుడిగాడు సినిమా తర్వాత అన్ని ఫ్లాప్ లను ఎదుర్కొన్నాడు. అయితే తర్వాత వచ్చిన నాంది సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడమే కాదు ఆయనపై ఉన్న కామెడీ హీరో మార్క్‌ చెరిపేసి కమర్షియల్ హీరోగా మారాడు. ఇక ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక టైం లో వాట్సాప్ లో ఫ్లాపులను ఎదుర్కొన్నా.. తర్వాత గబ్బర్ సింగ్ తో సక్సెసై ఎన్నో ఇండస్ట్రియల్ హిట్ సినిమాలను నటించాడు.