ఛీ ఛీ.. స్టార్ స్టేటస్ ఉన్న శ్రేయ ఘోషాల్ .. డబ్బు కోసం అలాంటి పనులు కూడా చేస్తుందా..?

శ్రేయ ఘోషల్ .. ఈ పేరు చెప్తే ఊగిపోని జనాలు ఉంటారా..? ఒక స్టార్ హీరోయిన్ కి క్రేజ్ ఎలా ఉంటుందో అంతకు డబల్ ట్రిపుల్ కాదు ఏకంగా 10 రెట్లు క్రేజ్ సంపాదించుకున్న టాప్ సింగర్ . ఈమె పాట పాడితే ఎంత వినసొంపుగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . ఇప్పటికీ మన మొబైల్ ఫోన్ లోని ప్లే లిస్టులో శ్రేయ ఘోషల్ పాడిన పాటలు ఎన్నెన్నో ఉంటాయి అన్న విషయం అందరికీ తెలిసిందే .

రీసెంట్ గా సోషల్ మీడియాలో శ్రేయ ఘోషల్ కి సంబంధించిన వీడియో ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది. శ్రేయ ఘోషల్ ఒక్కొక్క పాటకు లక్షల్లోనే రెమ్యూనిరేషన్ తీసుకుంటుంది. అంతేకాదు కొన్నిసార్లు ఆ రేంజ్ ఆ నెంబర్ కూడా డబుల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి . అయితే పలు చారిటీలకి వెళ్లి ఆమె పాటలు పాడిన సరే డబ్బులు తీసుకుంటుందట . నిజానికి మిగతా సింగర్స్ ఇలా చారిటీకి వెళ్లి పాటలు పాడితే డబ్బులు తీసుకోరు . తెలుగు సింగర్స్ అయితే అసలు తీసుకోరు .

మరి అంత పెద్ద స్టార్ స్టేటస్ ఉన్న శ్రేయ ఘోషాల్ చారిటీకి వెళ్లి పాటలు పాడితే డబ్బులు తీసుకుంటుంది అని తెలియడంతో ఫాన్స్ మండి పడుతున్నారు. అంతేకాదు శ్రేయ ఘోషల్ తీయ్యటి గొంతు వెనక ఇంత స్వార్థం ఉందా అంటూ ఫైర్ అవుతున్నారు. శ్రేయ ఘోషల్ అంటే అందరికీ ఇష్టమే .. ఆమె పాటలు నచ్చని వాళ్లు అంటూ ఉండరు. భాష రాకపోయినా సరే పాటలను మాత్రం చాలా చక్కగా అవలీలగా పాడేస్తూ ఉంటుంది . ఆమె తెలుగులో పడిన ఎన్నో పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అంతేకాదు శ్రేయ ఘోషల్ పాడిన పాటలు.. మన తెలుగు స్టార్ హీరోలకి కూడా చాలా చాలా ఇష్టం . అందుకే ఆమెతో అడిగిమరీ పాటలు పాడించుకుంటూ ఉంటారు..!!