అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. రీ రిలీజ్ కి రెడీ అవుతున్న ఆర్య..!

ప్రస్తుతం రీ రిలీజ్ లా ట్రెండ్ ఏ విధంగా మారిందో మనందరం చూస్తూనే ఉన్నాం. గతంలో ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ప్రస్తుత కాలంలో థియేటర్లలో రిలీజ్ చేస్తూ సూపర్ హిట్ కలెక్షన్స్ను అందుకుంటున్నారు డైరెక్టర్స్. ఇలా ఇప్పటికే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయ్యాయి.

ఇక తాజాగా అల్లు అర్జున్ సినిమా కూడా రిలీజ్ కి సిద్ధమయ్యింది. అల్లు అర్జున్ ఇప్పటివరకు నటించిన సినిమాల్లో ప్రతి ఒక్క సినిమా కూడా ఒక్కో ఆణిముత్యం. కానీ ఆర్య సినిమా మాత్రం వేరే అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కంటతడి పెట్టాల్సిందే. ఫీల్ మై లవ్ అంటూ అందరిని లవ్ లో పడేసాడు బన్నీ. ఈ మూవీలో బన్నీ నటన మరియు కామెడీ కి ఎంతోమంది ఫ్యాన్స్ ఏర్పడ్డారు.

ఇక ఆర్య మూవీ 2004లో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కింది. మే 7 కి ఈ మూవీ రిలీజ్ అయి 20 ఏళ్ళు అవుతుంది. దీంతో ఈ మూవీ 27 అని రీ యూనియన్ ఈ వెంట్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ మూవీ ని రీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అన్నీ కుదిరితే ఈ సినిమాను మే 7న రీ రిలీజ్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తుంది.