శుభలేఖ షేర్ చేస్తూ సర్ప్రైజ్ ఇచ్చిన నవదీప్.. కానీ చిన్న ట్విస్ట్..!

టాలీవుడ్ హీరోలలో ఒకరైన నవదీప్ మనందరికీ సుపరిచితమే. నిత్యం కాంట్రవర్షియల్ కామెంట్స్ మరియు పెళ్లిపై అనేక వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు నవదీప్. ఇక ఇటీవల ఈగల్ మూవీలో రవితేజ తో ఓ కీలకపాత్ర పోషించి మంచి ప్రశంసల వర్షం కురిపించుకున్నాడు. ప్రస్తుతం నవదీప్ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.

గతంలో ఆర్య వంటి సినిమాలలో మంచి పాత్రలు పోషించిన ఈయన ప్రస్తుత కాలంలో సహా నటుడిగా నటిస్తున్నాడు. ఇక ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యాన్స్ కి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నాడు నవదీప్. ఇక నవదీప్ కి వయసు మీద పడినప్పటికీ ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. దీంతో సోషల్ మీడియాలో నిత్యం ఈయన పెళ్లిపై ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది.

ఇక తాజాగా నవదీప్ తన ఇంస్టాగ్రామ్ వేదికగా శుభలేఖను షేర్ చేస్తూ బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు. నవదీప్, పంఖురి హీరో మరియు హీరోయిన్లుగా నటిస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ మూవీ ” మౌళి “. ఈ మూవీ ఏప్రియల్ 19న రిలీజ్ కానుంది. ఇక ఈ విషయాన్ని ఒక శుభలేఖ కార్డులో పెట్టి ఏదో త్వరలో పెళ్లి చేసుకోబోయే వాడిలాగా ఆ శుభలేఖను ఓపెన్ చేసి బిట్విస్ట్ ఇచ్చాడు నవదీప్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.