బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా నివారించే ఆహారాలు ఇవే..!

ప్రస్తుత కాలంలో చిన్న వయసులోనే బ్రెయిన్ స్ట్రోక్ వంటివి చాలా కామన్ అయిపోయాయి. దీనికి కారణం మనం తినే ఆహారమే. మనం తినే ఆహారంలో సరైన పోషకాలు లేకపోవడం కారణంగా బ్రెయిన్ స్ట్రోక్ వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యలు పెద్దవారిలోనే కాదు చిన్న వారిలో కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఇక కొన్ని ఆహారాలను తీసుకోవడం ద్వారా ఈ బ్రెయిన్ స్ట్రోక్ ను నివారించవచ్చు. అందులో ముఖ్యమైన ఆహారం ఆకుకూరలు. ఆకుకూరలను తీసుకోవడం ద్వారా ఐరన్ మరియు ఇతర గుణాలు మీ బాడీకి అంది బ్రెయిన్ స్ట్రోక్ కి గురవకుండా ఉంటారు. ఇక చిన్న పిల్లలు ఎంతో ఇష్టంగా తినే డార్క్ చాక్లెట్ కూడా బ్రెయిన్ స్ట్రోక్ కి గురవకుండా కాపాడుతుంది.

ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా బ్రెయిన్ స్ట్రోక్ ఏర్పడదు. బాదం మరియు ఇతర విత్తనాలను తీసుకోవడం ద్వారా కూడా శరీరానికి కావాల్సిన తగిన పోషకాలు అంది బ్రెయిన్ స్ట్రోక్ కి గురవకొండ ఉంటారు. స్ట్రాబెరీస్ కూడా బ్రెయిన్ స్ట్రోక్ ని రాకుండా కాపాడుతాయి. అందువల్ల పైన చెప్పిన ఆహారాలను ప్రతిరోజు మీ డైలీ రొటీన్ లో చేర్చుకుంటూ మీ బ్రెయిన్ కి ఎటువంటి ముప్పు లేకుండా కాపాడుకోండి.