శ్రీలీల చేసిన పనికి ఫిదా అయిపోయిన స్టార్ క్రికెటర్.. ఏకంగా అంత మాటతో పొగిడేశాడుగా..!!

శ్రీ లీల .. టాలీవుడ్ ఇండస్ట్రీలో లేటెస్ట్ యంగ్ సెన్సేషన్ గా పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ అమ్మడు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . వరుస సినిమాలలో నటిస్తూ బిజీబిజీగా ముందుకు దూసుకెళ్తుంది. కాగా హీరోయిన్ శ్రీ లీల లాస్ట్ గా నటించిన సినిమా గుంటూరు కారం . అఫ్ కోర్స్ ఈ సినిమా కారణంగా ఎలాంటి ట్రోలింగ్ కి గురైంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

 

సోషల్ మీడియాలో విపరీతమైన బూతు పదాలతో ఆమెను ట్రోల్ చేశారు. కానీ శ్రీ లీల వాటిని పెద్దగా ఏం పట్టించుకోలేదు . తన పని తాను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తూ వచ్చింది . రీసెంట్గా సోషల్ మీడియాలో శ్రీ లీలా కి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది . క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ హీరోయిన్ శ్రీ లీల ను ఓ రేంజ్ లో పొగిడేసాడు . ఇటీవల విడుదలైన గుంటూరు కారం సినిమాను ఆయన చూశాడట .

 

“శ్రీలీల పెర్ఫార్మెన్స్ టూ గుడ్ అని .. మంచి ఎంటర్టైనింగ్ ఫెలో అని .. అందరూ కూడా ఆమె డాన్స్ తప్పకుండా చూడాల్సిందేనని.. ఓ రేంజ్ లో పొగిడేసారు “. అసలు శ్రీలపై జరిగిన ట్రోలింగ్ ఆయనకు తెలుసో తెలియదో కానీ ఈ సినిమా కారణంగా శ్రీ లీల హ్యూజ్ ట్రోలింగ్ ఎదుర్కొంది . అయినప్పటికీ రవిచంద్రన్ అశ్విన్ ఇలా మాట్లాడడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఆమె చేసిన డాన్స్ చూస్తే మతులు పోవాల్సిందే అంటూ ఓ రేంజ్ లో పొగిడేశారు. అంతేనా మీరు చూడకపోతే కచ్చితంగా చూడండి అంటూ కూడా ప్రమోట్ చేశాడు . దీంతో రవిచంద్రన్ మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి..!!