ఎన్టీఆర్, ఏఎన్నార్లను ముట్టుకున్నానని ఇంట్లోకి రానివ్వలేదు.. సీనియర్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..?!

ఒకప్పటి స్టార్ హీరోయిన్ షావుకారుజానకికు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. కేవలం తెలుగులోనే కాక తమిళ, కన్నడ భాషలోనూ తన సత్తా చాటుకుంది. మొత్తం 390కు పైగా సినిమాల్లో నటించిన జానకి అద్భుతమైన నటినతో నంది, పద్మశ్రీ పురస్కారాలను కూడా అందుకోవడం విశేషం. ప్రస్తుతం ఆమె వయసు 92 ఏళ్లు. అయినా ఈ వయసులోనూ షావుకారు జానకి అప్పుడప్పుడు కొన్ని ఇంటర్వ్యూస్‌లో అటెండ్ అవుతూ ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంటుంది. ఇక ఇటీవల ఆలీ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఓ షోలో సందడి చేసింది షావుకారు జానకి.

ఇందులో భాగంగా అలీ ప్రశ్నిస్తూ నాగేశ్వరరావు, ఎన్టీఆర్‌లను ముట్టుకున్నందుకు మిమ్మల్ని ఇంట్లోకి రానివ్వలేదట కదా అంటూ అడిగాడు. దానికి ఆమె స్పందిస్తూ వారిని ముట్టుకున్నందుకు కాదు.. సినిమాల్లో గెటప్స్ వలన బంధువుల ఇంటికి రానివ్వలేదు. సినిమాల్లో కొన్ని గెటప్‌లు వేయడం.. హీరోల దగ్గరకు వెళ్లాల్సి వచ్చేది. వాళ్లతో మంగళ సూత్రాలు కట్టించుకోవడం.. ఫస్ట్ నైట్ సీన్లు.. పెళ్లి సీన్లు.. ఇలా హాట్ సాంగ్స్ లో కూడా నేను నటించాల్సి వచ్చింది. ఇక వాటన్నిటిని నా కుటుంబ సభ్యులు, బంధువులు కూడా ఎవ్వరూ ఎప్పుడు అప్రిషియేట్ చేయలేదు. మా పిన్ని, అంకుల్స్ ఎవరు కూడా నన్ను వాళ్ళ ఇంట్లోకి రానిచ్చే వాళ్ళు కాదు అంటూ షావుకారు జానకి వివరించింది.

ఎప్పుడైనా వారి ఇంటికి వెళ్తే.. వద్దమ్మా అంకుల్ రానివద్దని అన్నాడు.. నువ్వు ఇంక ఎక్కడికైనా వెళ్లి ఉండు అని పంపించిన సందర్భాలు చాలా ఉన్నాయి అంటూ వివరించింది. అప్పట్లో సినిమాలు చేసే నటినటుల‌కు కొత్త ఇల్లు దొరకడం ఎంతో కష్టంగా ఉండేదని.. అందువల్ల చుట్టాలు ఇంటికి వెళ్దామంటే వాళ్లు కూడా గడప తొక్కనిచ్చే వాళ్ళు కాదని.. అప్పట్లో సినీ కళాకారులు పడిన బాధలు అన్నీ ఇన్ని కాదు అంటూ అలీకి వివరించింది. ఇప్పుడంటే సినిమాల్లో ఉన్న వారిని చుట్టాలు బతిమిలాడి మరి ఇంటికి రప్పించుకుంటున్నారు అంటూ చెప్పుకొచ్చింది. సినిమా వాళ్ళను గొప్ప వాళ్ళని ఎప్పుడు భావించరని.. ఇంకా ఏదో సాధించాలని తపనతో నటులు కూడా ఉంటారు అని చెప్పుకొచ్చింది. అయితే ఇలాంటి అవమానాలు ఎన్ని వచ్చినా షావుకారు జానకి సినిమాలను వదిలేయకుండా నటించడం నిజంగానే గ్రేట్ అని చెప్పాలి.