మెగాస్టార్ చిరంజీవి నట వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. మెగా పవర్ స్టార్‌గా క్రేజ్ సంపాదించుకున్నాడు రామ్ చరణ్. రెండవ సినిమా మగధీరతోనే ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేసి స్టార్ హీరోగా మారిపోయాడు. తర్వాత పలు సినిమాలో నటించి సక్సస్ అందుకున్నా.. ఊహించిన రేంజ్ లో ప్రేక్షకుల ఆదరణ రాలేదు. మెగాస్టార్ తనయుడిగా రామ్ చరణ్ డ్యాన్స్, ఫైట్లతో ఈస్ చూపించాడు. కానీ ముఖంలో ఎక్స్ప్రెషన్స్ పల్లకించలేకపోవడంతో కెరీర్ స్టార్టింగ్ లో క్రిటిక్స్ నుంచి ఎన్నో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎక్స్ప్రెషన్స్ పండించడం రాదని.. హావభావాలను చూపించలేడంటూ ఎంతోమంది విమర్శించారు.
అప్పటి వరకు కొన్ని సినిమాల్లో చరణ్ నటించినా పెద్దగా యాక్టింగ్ స్కోప్ కనిపించేది కాదు. నాలుగు డ్యాన్స్ స్టెప్‌లు, మూడు ఫైట్లు అన్నట్టుగా సినిమాలు నడిచేవి. అలాంటి టైంలో వీటన్నింటికీ చెక్ పెడుతూ సుకుమార్ డైరెక్షన్‌లో రంగస్థలం సినిమాలో నటించాడు రామ్ చరణ్. చెర్రీ ఇమేజ్‌ను పూర్తిగా ఈ సినిమా మార్చేసింది అనడంలో అతిశయోక్తి లేదు. ఈ సినిమాలో రామ్ చరణ్ తను నటనా టాలెంట్ మొత్తం బయట పెట్టాడు. యాక్టింగ్ స్కిల్స్ ఏంటో చూపించారు. ఈ సినిమాలో చరణ్ అద్భుత నటనతో విమర్శకుల నుండి ప్రశంసలు అందుకున్నాడు. ఈ మూవీ రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది.
ఈ సినిమా తర్వాత బోయపాటి కాంబినేషన్లో వినయ విధేయ రామ సినిమా తెరకెక్కినప్పటికీ ఊహించిన సక్సెస్ రాలేదు. ఇక తర్వాత రాజమౌళి డైరెక్షన్‌లో తారక్, చెర్రీ కాంబోలో తెరకెక్కిన ఆర్‌ఆర్ఆర్ సినిమా ఎలాంటి క్రేజ్ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతో మెగా పవర్ స్టార్ చరణ్ కాస్త గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. అలా చరణ్ పట్టుదలతో నటన రాదంటూ విమర్శించిన వారినుండే ప్రశంసలు అందుకుని గ్లోబల్ స్టార్ గా మారాడు. రాంచరణ్ లో ఉన్న పట్టుదల.. ఏదైనా చేయాలని అనుకుంటే కచ్చితంగా అది 100% ఇవ్వడానికి ప్రయత్నించే.. ఆ క్వాలిటీ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా మార్చింది అనడంలో అతిశయోక్తి లేదు.