విజయ్ దేవరకొండ కోసం అలాంటి పని చేసిన రష్మిక.. వీళ్లు మరి టూ మచ్ గా తయారు అయ్యారే..!

రష్మిక మందన్నా.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు . నేషనల్ క్రష్ గా ట్యాగ్ చేయించుకుంది. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా మారడమే కాకుండా అత్యధిక రూమర్స్ అందుకున్న ఏకైక హీరోయిన్గా బాగానే పబ్లిసిటీ కూడా సంపాదించుకుంది. టాలీవుడ్ – హాలీవుడ్ – బాలీవుడ్ ఇండస్ట్రీలలో నెంబర్ వన్ హీరోయిన్గా రాజ్యమేలేస్తున్న రష్మిక మందన్నా.. రీసెంట్గా అనిమల్ సినిమాతో బోల్డ్ బ్యూటీ అంటూ ట్యాగ్ చేయించుకుంది .

కాగా పర్సనల్ విషయంగా ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూ ఉంటుంది రష్మిక మందన్నా. విజయ్ దేవరకొండ తో ప్రేమాయణం కొనసాగిస్తుంది అంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి . అయితే ప్రేమ దోమ ఏదీ లేదు అంటూ చెప్పకు వచ్చే ఈ జంట మాత్రం పరోక్షంగా తమ మధ్య ఉన్న ప్రేమను మాత్రం బయట పెట్టేస్తూ వస్తూ ఉంటుంది. రీసెంట్గా మరోసారి దొరికిపోయింది ఈ క్రేజీ లవ్ జంట.

విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఒక పోస్ట్ చేశారు . ఆ పోస్టులు విజయ్ దేవరకొండ పింక్ కలర్ క్యాప్ ధరించారు. అయితే ఉమెన్స్ డే సందర్భంగా రష్మిక మందన్నా కూడా అదే పింక్ క్యాప్ ధరించిన ఫోటోని షేర్ చేస్తూ మహిళలకు శుభాకాంక్షలు తెలియజేసింది. సోషల్ మీడియాలో ఈ ఫోటో బాగా ట్రెండ్ అవుతుంది. మళ్ళీ మీ మధ్య ప్రేమను బయట పెట్టేశారా అంటూ ఫన్నీగా ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు .

అంతేకాదు రష్మిక – విజయ్ దేవరకొండ జంట చక్కగా ఉంటుంది అని చెప్పుకొస్తున్నారు . అంతేకాకుండా రష్మిక – విజయ్ కోసం తన ఫ్యామిలీని సైతం ఎదిరించిందట . నిజానికి వీళ్ళ మధ్య ప్రేమ ఉంది అని అందరికీ తెలిసిందే. కానీ ఫ్యామిలీస్ ఒప్పుకొని కారణంగానే వీళ్ళు ఇంకా ప్రేమ విషయాన్ని బయట పెట్టడం లేదట . అయితే రష్మిక చేసుకుంటే విజయ్ నే చేసుకుంటాను మిగతా ఎవర్ని చేసుకోను అంటూ ఫ్యామిలీకి తేల్చి చెప్పిందట. నిజంగా ఇది గ్రేట్ అని చెప్పాలి . ఈ రోజుల్లో కూడా ఇలా ప్రేమించే అమ్మాయి ఉంటుందా..? అంటున్నారు అబ్బాయిలు..!!