శ్రీదేవి డ్రామా కంపెనీలో షాకింగ్ ఇన్సిడెంట్.. అతని కోసం చెయ్యి కట్ చేసుకున్న శ్రీవిద్య.. ఆరు కుట్లు..

తెలుగు బుల్లితెరపై ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే కామెడీ షో లలో శ్రీదేవి డ్రామా కంపెనీ ఒకటి. దీని గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ ద్వారా భారీ పాపులారిటి పొందిన కమెడియన్స్ అంతా ఈ షోలో కంటెస్టెంట్లుగా ఉంటారు. ఇక తాజాగా ఈ షోలో షాకింగ్ ఇన్సిడెంట్ జ‌రిగింది. ఈ షోలో లేడీ కమెడియన్‌గా క్రేజ్ సంపాదించుకున్న శ్రీవిద్య తన ప్రియుడు మరో మెయిల్‌ కమెడియన్ అయినా ఓ వ్యక్తి కోసం తన చేయని కట్ చేసుకుని తీవ్ర గాయాన్ని చేసుకుంది. అలా చేసుకోవడం వల్ల శ్రీవద్య చేతికి ఆరు కుట్లు పడ్డాయి. అసలు విషయం ఏంటంటే ఇన్‌స్టాలో వీడియోలు చేస్తూ.. లోకల్ ఛానల్ లో కామెడీ వీడియోలు చేసే శ్రీవిద్యకు జబర్దస్త్ ద్వారా అవకాశమొచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమెకు విపరీతమైన పాపులారిటీ దక్కింది. ముఖ్యంగా ఈ అమ్మ‌డు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కూడా కనిపించడం విశేషం.

అయితే అద్భుతమైన కామెడీతో ఆకట్టుకునే శ్రీవిద్య.. తాజాగా అందరికీ ఓ బిగ్ షాక్ ఇచ్చింది. తన ప్రియుడి గురించి రివీల్ చేసింది. జబర్దస్త్‌తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీలో తనతో పాటు కామెడీ స్కిట్ ను చేసే మరో వ్యక్తిని ఇష్టపడుతున్నట్లు చెప్పుకొచ్చింది. కేవలం చెప్పడమే కాదు అతడు ఈ మధ్య తను నాతో ఎక్కువగా మాట్లాడడం లేదని, పట్టించుకోవడంలేదని, కనీసం ఫోన్లు చేస్తుంటే లిఫ్ట్ కూడా చేయట్లేదని.. నేను అందుకే చాలా ఫీల్ అయ్యాను.. అతనికి నా ప్రేమ ఏంటో తెలియాలని.. ఎలా చూపించాలో తెలియక.. ఆ బాధ ఎలా దిగమింగుకోవాలో తెలియక.. నా చేయి కట్ చేసుకున్నానని వివరించింది. గాయమై ఆరు కుట్లు పడ్డాయని చెప్పుకొచ్చింది. ఇక‌ ముందుగా శ్రీవిద్య తనకు చేదు గాయం అయిందని మాత్రమే చెప్పగా.. కమెడియన్ హైపర్ ఆది అసలు విషయం ఏంటని ప్రశ్నించాడు. దీంతో కమెడియన్ బాబు కోసమే శ్రీవిద్య ఎలా చేస్తుందని అక్కడ ఉన్న వాళ్ళంతా వివరించారు.

Babu, Sri Vidya Dance Performance | Sridevi Drama Company | 17th September  2023 | ETV - YouTube

దీంతో స్టేజ్ మీదకు బాబును కూడా పిలిచి పూర్తి క్లారిటీ ఇచ్చేశారు. ఇదంతా చూసిన యాంక‌ర్ ర‌ష్మి ఇలాంటి వాటికోసం చేతులు కట్ చేసుకోవడం ఏంటి పిచ్చి కాకపోతే.. ఇలాంటి పనులు అసలు ఎప్పుడు చేయకండి అంటూ చెప్పుకొచ్చింది. ఇక బాబు కూడా నేను ఏదో బిజీ లో ఉండి మాత్రమే నిన్ను పట్టించుకోలేదు. నాకు నువ్వంటే ఇష్టమే. నీ మీద ప్రేమ లేక కాదు అంటూ వివరించాడు. మనం జీవితాంతం కలిసి ఉండకపోయినా నువ్వు మాత్రం మ‌రోసారి ఎప్పుడు ఇలాంటి పనులు చేయొద్దు అంటూ చెప్పుకొచ్చాడు. నువ్వు మాత్రమే కాదు మరెవరు ఇలాంటి పనులు చేయకండి అంటూ వివరించాడు. అయితే ఇదంతా టిఆర్పి కోసం వేసిన ప్లాన్ అని చూసేవారికి క్లియర్ గా తెలుస్తుంది. ముఖ్యంగా అసలు చేతిని కానీ కుట్లను కానీ సరిగ్గా చూపించకపోవడంతో ఇదంతా కామెడీ మెసేజ్ లో భాగమే అని క్లియర్గా తెలిసిపోతుంది.