చిరంజీవికి త్రిష అంటే అంత ఇష్టమా.. గిఫ్ట్ గా ఏం ఇచ్చారో చూడండి..!!

మెగాస్టార్ .. ఈ మధ్యకాలంలో టూ యంగ్ గా మారిపోతున్నారు . ఎంతలా అంటే మనవరాలు పుట్టిన సరే చూడడానికి చాలా స్మార్ట్ గా స్టైలిష్ గా ట్రెండీగా తయారైపోతున్నాడు . రీసెంట్గా చిరంజీవి చేసిన పని అభిమానులకి షాకింగ్ గా ఉంది. అంతేకాదు అభిమానులు ఈ న్యూస్ ని బాగా ట్రెండ్ చేస్తున్నారు . ప్రెసెంట్ చిరంజీవి విశ్వంభర అనే సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు.

వశిష్ట దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది . కాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది . ఈ సినిమాలో హీరోయిన్గా త్రిష నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే . అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది . కాగా వీళ్ళ మధ్య మంచి మంచి సీన్స్ కూడా చిత్రీకరించారట మేకర్స్ . రీసెంట్గా త్రిష కి చిరంజీవి అద్దిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు.

ఆ గిఫ్ట్ ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది త్రిష . టెంపరేచర్ ని కూల్ చేసే ఒక వాటర్ మగ్ ని చిరంజీవి.. త్రిష కు గిఫ్ట్ చేశారు . “థాంక్యూ చిరు సార్ ” అంటూ ట్యాగ్ చేసింది . ప్రెసెంట్ సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతుంది. అయితే గతంలో చిరంజీవి ఎప్పుడూ ఇలా హీరోయిన్స్ కి గిఫ్ట్ ఇచ్చిన సందర్భాలు లేవు . కానీ ఎందుకు త్రిషకి మాత్రమే గిఫ్ట్ ఇచ్చాడు. ఆమె అంటే అంత స్పెషలా..? అంత ఇష్టమా..? అంటూ మెగా ఫ్యాన్స్ ఫన్నీగా ట్రోల్ చేస్తున్నారు . మొత్తానికి చిరంజీవి – త్రిష జంట మరోసారి తెర పై కనిపించబోతూ ఉండడంతో సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు..!!