బోయపాటితో సినిమాకి ఓకే చెప్పినా మోక్షజ్ఞ.. సంతోషంలో నందమూరి ఫ్యాన్స్..!

నందమూరి బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ గురించి పరిచయం అవసరం లేదు. నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ పై బాలయ్య అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక బాలయ్య తన కుమారుడు మోక్షజ్ఞ ని ఏడాదే ఇండస్ట్రీకి పరిచయం చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు.

అదేవిధంగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో మోక్షజ్ఞ మొట్టమొదటి సినిమా ఉండనున్నట్లు తెలుస్తుంది. బోయపాటి ,మోక్షజ్ఞ సినిమా క‌థ గురించి ఇప్పటికే డిస్కషన్స్ కూడా జరిగాయని టాక్. మోక్షజ్ఞ డెబ్యూ సినిమాకు బోయపాటి లాంటి మాస్ డైరెక్టర్ టచ్ ఉంటే ఆ మూవీ తప్పనిసరిగా సక్సెస్ అవుతుందని నందమూరి అభిమానులు భావిస్తున్నారు.

ఇక అంతా అనుకున్నట్లు జరిగితే ఈ రూమర్ కాస్త నిజం అవుతుంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏదేమైనా ఇది క్రేజీ రూమర్ అయినప్పటికీ ఇది నిజం కావాలని కోరుకుంటున్నారు నందమూరి ఫ్యాన్స్.