ఈవినింగ్ పూట ఈ స్నాక్స్ తీసుకుని సూపర్ స్ట్రాంగ్ గా తయారవ్వండి..!

సాయంత్రం అయ్యే సరికి మనకి గుర్తు వచ్చేది స్నాక్స్. ప్రతిరోజు సాయంత్రం స్నాక్స్ తినాలి. ఉడికించి తయారు చేసే ఈ రెసిపీ ఎంతో రుచిగా ఉంటుంది. ఇదొక గుజరాతీ సాంప్రదాయ స్నాక్. నానబెట్టిన బియ్యం,శనగపిండితో దీనిని తయారు చేస్తారు. పల్లి లేదా కొబ్బరి చట్నీ తో తీసుకోవచ్చు.

బేల్ పూరి ఆరోగ్యానికి ఎంతో మంచిది. మరమరాలతో తయారు చేసే ఈ రెసిపీ బరువు తగ్గించటంలో సహాయపడుతుంది. మరమరాల్లో ఉప్పు,కారం,కొత్తిమీర,టమాటో, ఉల్లిపాయ ముక్కలు,నూనె కలిపి సింపుల్ గా తయారు చేయవచ్చు. పానీపూరిని ఇంట్లో కూడా తయారు చేయవచ్చు. చింత పులుసు తో పాటు శనగలు,బంగాళదుంప, చాట్ మసాలాతో తయారు చేసే పప్పుతో వీటిని తీసుకోవచ్చు.సాయంత్రం స్నాక్ లోకి సమోసా చాలామంది ఇష్టపడతారు.

బంగాళదుంప, పచ్చి బఠానీ,మసాలాలు కలిపి సమోసాల్లో స్టాఫ్ చేసి సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. బంగాళదుంపను గుజ్జులా చేసి వాటికి మసాలాలు కలిపి నూనెలో ఫ్రై చేస్తే ఆలూ టిక్కా రెడి. ఏదైనా చట్ని లేదా మోగ ర్టేతో తీసుకోవచ్చు. తెలుగు రాష్ట్రంలో ఫేమస్ స్నాక్ పునుగులు.పెసరపప్పు పిండి లేదా శనగపిండితో వీటిని తయారు చేస్తారు. మీరు కూడా సాయంత్రం ఈ స్నాక్స్ తప్పకుండా తినండి.