జాన్వి నెక్స్ట్ టార్గెట్ ఆ హీరో నేనా ..? చరణ్ – ఎన్టీఆర్ లనే మించిపోయే స్టార్ ని పట్టేసిందిరోయ్..!!

జాన్వి కపూర్ ..జాన్వి కపూర్..జాన్వి కపూర్.. తెలుగు ఇండస్ట్రీలో ప్రజెంట్ ఈ పేరు ఏ రేంజ్ లో మారు మ్రోగిపోతుందో ఎంత చెప్పకున్నా తక్కువే . ఒక పాన్ ఇండియా హీరోయిన్ ఒక స్టార్ హీరోయిన్ కి మించిన రేంజ్ లో దూసుకుపోతుంది . దినంతటికీ కారణం బోనీకపూర్ అన్న విషయం అందరికీ తెలిసిందే . శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వి కపూర్ ఇప్పుడు బోనీకపూర్ కూతురుగా మంచి మంచి ఆఫర్స్ అందుకుంటుంది. కూతురు కెరియర్ని సెటిల్ చేసే దానికి కోలీవుడ్ – టాలీవుడ్ -బాలీవుడ్ ప్రముఖులతో బాగా రాపోలను పెంచుకుంటున్నాడు .

బోనీకపూర్ రీసెంట్గా చరణ్ సినిమాలో నటించే అవకాశం కూడా అందుకుంది . అంతకుముందే దేవర సినిమాతో టాలీవుడ్లోకి డెబ్యూ ఇవ్వడానికి రెడీ అయింది . ఇలా బ్యాక్ టు బ్యాక్ ఇద్దరు పాన్ ఇండియా స్టార్ సినిమాలతో నటించడం అంటే మామూలు విషయం కాదు . అయితే ఇప్పుడు అంతకుమించిపోయే రేంజ్ ఆఫర్ ని పట్టేసింది జాన్వి కపూర్ అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం మహేష్ – రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో జాన్వి కపూర్ వన్ ఆఫ్ ది కీలక పాత్ర పోషించబోతుందట. ఈ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసి పడేస్తుంది . ఇన్నాళ్లు పాన్ ఇండియా స్థాయిలోనే పాపులారిటి సంపాదించుకున్న ఈ బ్యూటీ.. ఈ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకోవడం కన్ఫామ్ అంటున్నారు అభిమానులు. అయితే జాన్వి కపూర్ ఇంతటి పెద్ద ఆఫర్ అందుకోవడం వెనక బడా హీరో హస్తం ఉంది అంటూ ప్రచారం జరుగుతుంది . ఏ హీరో హస్తం ఉన్న జాన్వి కపూర్ టాలెంట్ ప్రూవ్ చేసుకోకపోతే కష్టమే అంటున్నారు జనాలు..!!