అందరి హీరోలను ఓ రేంజ్ లో పొగిడేసే జక్కన్న.. ఆ హీరోని మాత్రమే ఎందుకు అలా అన్నాడు..? అంత కోపమా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకధీరుడుగా పాపులారిటీ సంపాదించుకున్న రాజమౌళి .. ఎప్పుడు కూడా ఎవరిని హర్ట్ చేయని విధంగా.. తన పని తాను చూసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు . గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న రాజమౌళి.. ప్రతి మాటను ఆచితూచి ఆలోచించి మాట్లాడుతాడు . అందుకే రాజమౌళి అంటే అందరికీ అదో ప్రత్యేకమైన అభిమానం . రీసెంట్గా సోషల్ మీడియాలో రాజమౌళికి సంబంధించిన గతం తాలూకా ఒక వార్త బాగా వైరల్ గా మారింది .

ప్రభాస్ నటించిన బిల్లా సినిమా టైంలో ఈ సినిమాలో ప్రభాస్ హృతిక్ రోషన్ కంటే చాలా అందంగా ఉన్నాడు అంటూ టైం స్లిప్ అయ్యాడు రాజమౌళి . అప్పట్లో ఈ వార్త బాగా సెన్సేషన్ అయింది . పలువురు రాజమౌళి పై బాలీవుడ్ జనాలు వ్యంగ్యంగా ట్రోల్స్ కూడా చేశారు. అయితే అప్పట్లోనే ఆ విషయంపై క్లారిటీ ఇచ్చేసాడు రాజమౌళి . తాను హృతిక్ రోషన్ ని తక్కువ చేయలేదు అని.. హృతిక్ రోషన్ అంత అందగాడు ప్రభాస్ అంటూ చెప్పాను అని.. తాను చేసిన తప్పు హృతిక్ రోషన్ పేరు ఇక్కడ ప్రస్తావించడమేనని దానివల్ల ఆయన ఫ్యాన్స్ హర్ట్ అయినట్లున్నారు అంటూ ఆయన తప్పును ఆయన సరిదిద్దుకున్నాడు .

అయితే ప్రతి చిన్న విషయంలోనూ ఆచితూచి మాట్లాడే రాజమౌళి .. ఆ ఈవెంట్ లో మాత్రమే ఎందుకు స్లిప్ అయ్యాడా..? అన్నది ఇప్పటికీ అభిమానులకి మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది . కావాలనే అనేసి ఆ తర్వాత ఇలా సర్ది చెప్పుకున్నాడా ..? అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. సోషల్ మీడియాలో రాజమౌళి పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది..!!