అప్పుడే ఐటెం సాంగ్ లోనా..? ఆ హీరో కోసం బోల్డ్ డెసిషన్ తీసుకున్న వైష్ణవి చైతన్య..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సేషనల్ గా మారిపోయింది. హీరోయిన్స్ ఐటమ్ సాంగ్ చేయడం సర్వసాధారణం. స్టార్ హీరోయిన్స్ ఐటెం సాంగ్స్ చేయడం మరి మరి కామన్ . అయితే అదంతా పెద్ద సినిమాలలోనే .. కానీ నిన్నకాకమున్న ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోయిన్ అప్పుడే ఐటెం సాంగ్ లో నటించే నిర్ణయం తీసుకోవడం మాత్రం ఫాన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసింది . ఆమె మరి ఎవరో కాదు బేబీ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన వైష్ణవి చైతన్య.

యూట్యూబ్ ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్న వైష్ణవి చైతన్య .. హీరోయిన్గా నటించిన సినిమా బేబీ . ఈ సినిమా ఎంతటి ఘనవిజయం అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆమె కెరియర్నే టర్న్ చేసింది. ప్రజెంట్ ఆమె చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి . మూడు చిన్న బడ్జెట్ సినిమాలు అయినా ఆమెకు క్రేజ్ తెచ్చే సినిమాలు కావడం గమనార్హం . ప్రభాస్ సినిమాలో సిస్టర్ పాత్రలో నటించబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది.

ఇలాంటి మూమెంట్లోనే తన ఫేవరెట్ హీరో రౌడీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ సినిమాలో బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య ఐటెం సాంగ్ చేయబోతుంది అన్న వార్త వైరల్ గా మారింది. విజయ్ తిన్నూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం వైష్ణవి చైతన్యను అప్రోచ్ అయ్యారట మేకర్స్ . విజయ్ దేవరకొండపై ఉండే అభిమానంతో రిస్క్ అని తెలిసిన కూడా ఆమె ఈ పాటను ఓకే చేసిందట. అయితే ఎక్కడ కూడా వల్గర్ గా లేకుండా ఫోక్ స్టెప్స్ తోనే మ్యానేజ్ చేసే విధంగా ఈ పాటను చిత్రీకరించబోతున్నారట. ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్ లో వైరల్ అయిపోతుంది..!!