కొంప ముంచేసిన కొరటాల.. కొత్త పోస్టర్ తో సినిమా టాప్ సీక్రేట్ ట్విస్ట్ లీక్ చేసేశాడుగా..!!

ఈ మధ్యకాలంలో పొరపాటున తమ సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ ను ఆ డైరెక్టర్.. ఆ సినిమా నటులే లీక్ చేస్తూ ఉండడం గమనార్హం. రీసెంట్గా అలాంటి సిచువేషన్ ఎదుర్కొంటుంది దేవర సినిమా టీం . టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ గా పాపులారిటీ సంపాదించుకున్న తారక్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా దేవర . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఎంతో భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కబోతుంది.

ఈ సినిమాలో హీరోయిన్లుగా మలయాళీ బ్యూటీ అదేవిధంగా జాన్వి కపూర్ నటించబోతున్నారు . ఈ సినిమాలో శ్రీకాంత్ కూడా కీలకపాత్రలో కనిపించబోతున్నాడు. రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన ఒక గూస్ బంప్స్ వీడియో లీక్ అయిన విషయం తెలిసిందే. పంచకట్టులో ఎన్టీఆర్ అద్భుతమైన లుక్స్ లో కనిపించాడు . అంతేకాదు ఈ సినిమా నుంచి మూవీ టీం కొత్త ఫోటోలు కూడా రిలీజ్ చేసింది. ఈ ఫోటో అభిమానులకి ఆనందకరంగానే ఉన్న కొంతమంది జనాలకు పెద్ద డౌట్ క్రియేట్ చేస్తుంది.

ఎన్టీఆర్ ఈ సినిమాలో డ్యూయల్ షేడ్ లో కనిపించబోతున్నాడు అని ప్రచారం జరుగుతుంది . మరి ఎన్టీఆర్ తాజా లుక్ చూస్తే పెద్దగా చేంజ్ ఏం కనిపించట్లేదు . నార్మల్ లుక్ లో ఎలా ఉన్నాడో ..? తండ్రి పాత్రలో కనిపించే ఎన్టీఆర్ కూడా అలాగే ఉన్నాడు. ఈ సినిమా విషయంలో కొరటాల తీసుకున్న నిర్ణయంపై జనాలు అయోమయ స్థితిలో ఉండిపోయారు. అంతేకాదు కొరటాల శివ తాజాగా రిలీజ్ చేసిన ఫోటోలో ఎన్టీఆర్ లుక్స్ చూస్తుంటే ఏదో జబ్బు మనిషిలా ఉన్నాడు అంటున్నారు..

బహుశా ఈ సినిమాలో ఎన్టీఆర్ను మనకు ఏదైనా జబ్బు పాత్రలో చూపించబోతున్నాడు అన్న డౌట్ కూడా రాకమానదు . సినిమాకి సంబంధించిన ఇంపార్టెంట్ ట్విస్టులను ఇలా ఫోటోల రూపంలో లీక్ చేసేస్తే కొరటాలకు భారీ డిజాస్టర్ తప్పదు అంటూ సజెస్ట్ చేస్తున్నారు . సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా బాగా వైరల్ గా మారింది . చూద్దాం మరి దేవర ఎలాంటి హిట్ అందుకుంటుందో..?