చాలా అన్యోన్యంగా ఉండే అల్లు అర్జున్ – స్నేహ రెడ్డి ..ఆ ఒక్క విషయంలో మాత్రమే బాగా గొడవపడతారా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది జంటలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . స్టార్ సెలబ్రిటీస్ కూడా కొంతమంది .. ఇండస్ట్రీలో ఉండే వాళ్ళనే ప్రేమించి పెళ్లి చేసుకుంటే ..మరి కొంతమంది అసలు ఇండస్ట్రీకి సంబంధం లేని వాళ్లను గాఢంగా ప్రేమించి ఇంట్లో చెప్పి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయినా సరే ఘనంగా పెళ్లి చేసుకున్నారు . ఆ లిస్ట్ లోకి వస్తారు అల్లు అర్జున్ -స్నేహ రెడ్డి ఇద్దరికీ అస్సలు టచ్ ఉండదు .

అల్లు అర్జున్ ఊర నాటు ఎనర్జీతో ఉంటాడు.. స్నేహ రెడ్డి చాలా కూల్ చాలా సైలెంట్ గా ఉంటుంది. అసలు ఆమె మాట్లాడిన సందర్భాలు మనం ఇప్పటివరకు రెండో మూడో చూసుంటే గొప్ప .. అంత సైలెంట్ అయితే వీళ్ళిద్దరికీ ఎలా మ్యాచ్ అయిందా..? అంటే అది దేవుడు నిర్ణయమే .. అదంతా ప్రేమ మాయ.. ప్రేమ ఏమైనా చేస్తుంది అంటూ ఉంటారు అభిమానులు ఈ జంట .

చాలా అన్యోన్యంగా ఉంటుంది.. చక్కగా ఫ్యామిలీ లైఫ్ ని ముందుకు తీసుకెళ్తుంది .. అయితే ఎంత చక్కగా ఎంత ఆనందంగా ఉన్నా ఫ్యామిలీలో గొడవలు అనేటివి కామన్ . మరీ ముఖ్యంగా భార్యాభర్తల మధ్య తగాదాలు కచ్చితంగా వస్తూనే ఉంటాయి . అయితే అల్లుఅర్జున్ స్నేహారెడ్డిల మధ్య కూడా గొడవలు వస్తాయట . మరీ ముఖ్యంగా వీళ్ళ మధ్య వచ్చే గొడవలు పిల్లల విషయంలోనే.. స్నేహ రెడ్డి పిల్లలను పడుతూ లేస్తూ పెంచాలి.. దెబ్బ తగిలితేనే వాళ్ళకి ఆ నొప్పి బాధ తెలుస్తుంది ..లైఫ్ లో స్ట్రాంగ్ అవ్వగలరు అనుకుంటుందట.

కానీ అల్లు అర్జున్ తన పిల్లలకు దెబ్బ తగిలితే చూడలేడు .. అందుకే అన్ని వాళ్ళు అడగకముందే.. అన్ని సౌకర్యాలను సమకూరుస్తాడట. ఆ విషయంలో మాత్రం స్నేహారెడ్డి అల్లు అర్జున్ డిఫరెంట్ మైండ్ సెట్. అందుకే వాళ్లకు గొడవలు వస్తూనే ఉంటాయట . ఈ మేటర్ లో తప్పిస్తే మిగతా మేటర్ లో అంతా వీళ్లిద్దరూ సూపర్ పర్ఫెక్ట్ జోడి..!!