ఆ టాలీవుడ్ డైరెక్టర్ కు రాజమౌళి పెద్ద ఫ్యాన్.. జక్కన్న అభిమానిగా ఎందుకు మారాడంటే..?!

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్లు ఎంట్రీ ఇస్తారు. కానీ వారిలో కొందరు మాత్రమే సక్సెస్ సాధిస్తారు. అలా ఈ జ‌న‌రేష‌న్‌ సక్సెస్ ఫుల్ దర్శకులలో రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, అనిల్ రావిపూడి, సుకుమార్, కొరటాల శివ, క్రిష్, సందీప్ రెడ్డి వంగా లాంటి వాళ పేర్లు వినిపిస్తాయి. వీరిలో పూరి జగన్నాథ్ ఓ వైవిధ్య‌మైన ద‌ర్శ‌కుడు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, పోకిరి, బిజినెస్‌మేన్, ఇస్మార్ట్ శంకర్ లాంటి ఎన్నో సినిమాలతో బ్లాక్ బస్టర్ స‌క్స‌స్ అందుకుని తన ఖాతాలో వేసుకున్న పూరి.. ఈ విజయాలను చూడ‌క ముందే రియల్ లైఫ్‌లో చాలా కష్టాలను చెవి చూశాడు. మానసికంగా, శారీరకంగా ఎన్నో ఎదురు దెబ్బలు ఎదుర్కొని ముందుకు సాగాడు. ఎప్పుడు క‌ష్టాల‌కు బ‌య‌ప‌డి వెన‌క‌డుగు వేయలేదు. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి పూరీ అహ‌ర్నిశ‌లు శ్ర‌మించాడు.

Puri, This Is Not The First Time! | cinejosh.com

ఎక్కడ పడిపోయాడో అక్కడే మళ్ళీ నిలబడి చూపించాలనే కసి పూరి జగన్నాథ్ లో ఎక్కువగా ఉంటుంద‌ట‌. అందుకే చాలామంది హీరోలు, దర్శకులు పూరికి ఫిదా అవుతారు. మొండి పట్టుదలతో ముందడుగు వేసే ఈ డైరెక్ట‌ర్‌ను చూసి చాలామంది కొత్త దర్శకులు ఇండస్ట్రీలో అడుగు పెట్టారన‌డంలో అతిశయోక్తి కాదు. అయితే ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నా ఇండస్ట్రీలో ఎంత ఎత్తుకు ఎదిగిన ఎప్పుడు ఒదిగి ఉంటాడు. అతనిలోని ఈ మంచి లక్షణాలే ఆయ‌న‌ను దిగ్గజ దర్శకుడు రాజమౌళికి కూడా నచ్చేలా చేశాయి. అందుకే పూరీకి రాజమౌళి కూడా పెద్ద ఫ్యాన్‌ అయ్యాడట‌. ఆయ‌నే కాదు వి.వి వినాయక్‌కి కూడా పూరీ జగన్నాథ్ అంటే చాలా ఇష్టం. పూరి జగన్నాథ్ ఎలాంటి ప్రాబ్లం వ‌చ్చిన‌ తన మైండ్ వ‌ర‌కు తీసుకోడు. వాటిని ప్రశాంతంగా సాల్వ్ చేయడానికి ప్ర‌యత్నిస్తాడు. ఈ క్వాలిటీ చాలామందికి నచ్చుతుందని సెల‌బ్రిటీస్ చెప్తు ఉంటారు.

Ram Pothineni Crazy Indian Project Double iSmart In Cinemas In 100 Days On  March 8th

చాలా జోవియల్‌గా ఉండే ఈ పూరి అంటే హీరోలకు కూడా చాలా అభిమానం. ఇక పూరి లైగర్ సినిమా వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా భారీ అంచనాల నడుమ రిలీజై డిజాస్టర్ కావ‌డంతో చాలా స‌మ‌స్య‌లు ఎదుర‌య్యాయి. కాగా ప్ర‌స్తుతం సూరి డబుల్ ఇస్మార్ట్ సినిమా తెర‌కెక్కిస్తున్నాడు. అది ఈ సంవత్సరం జూన్ 14న ప్రేక్ష‌కుల‌ముందుకు రానుంది. ఈ మూవీ హిట్ అయితే మళ్లీ పూరి జగన్నాథ్ కెరీర్ గాడిలో పడుతుందన‌టంలో సందేహం లేదు. ఈ మూవీపై ప్రేక్ష‌కులలో భారీ హైప్ నెల‌కొంది. కనుక‌ రిలీజ్ చేసే ముందు అన్ని సరిచూసుకొని హిట్ కొట్టేలా పూరీ ప్లాన్ చేస్తున్నాడ‌ట‌.