ఉప్పెన సినిమా చేయడానికి కృతి శెట్టి పెట్టిన కండీషన్ నే.. ఇప్పుడు జాన్వీ కూడా పెట్టిందా..? చచ్చాడు పో బుచ్చి బాబు..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి .. ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన విషయం మనందరికీ తెలిసిందే . ఆఫ్ కోర్స్ ఇప్పుడంటే అమ్మడు క్రేజ్ లేదు.. డమాల్ అంటూ పబ్లిసిటీ పడిపోయింది . కానీ ఉప్పెన సినిమా టైంలో మాత్రం కుర్రాళ్ళు కృతిశెట్టి ఫోటోను బాత్రూంలో తగిలించుకొని మరి తెగ ఎంజాయ్ చేసేవాళ్లు . అంతలా క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకునింది కృతి శెట్టి .

అయితే ఉప్పెన సినిమాకు కృతి శెట్టి బుచ్చిబాబు సనాకు క్రేజీ కండిషన్ పెట్టిందట . ఆశ్చర్యమేంటంటే అటువంటి క్రేజీ కండిషన్ ని జాన్వి కపూర్ ఇప్పుడు బుచ్చిబాబు సనా దర్శకత్వంలో చరణ్ నటించబోయే సినిమాలో కూడా పెట్టింది అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది . జనరల్గా ఏ హీరోయిన్ కైనా స్టార్ హీరో సినిమాల్లో నటిస్తూ ఉంటే ఒక భయం ఉంటుంది . ఎక్కడ మన పాత్రను తక్కువ చేస్తారో అన్న ఫీలింగ్ ఉంటుంది .

అదే విషయాన్ని ఓపెన్ గా ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సనాతో చెప్పేసి ..నా పాత్ర ఎక్కడ తగ్గకుండా చూడండి సార్ ..నాకు ఈ సినిమా చాలా ఇంపార్టెంట్ అంటూ చెప్పుకొచ్చిందట . అదే విధంగా ఇప్పుడు జాన్వి కపూర్ సైతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో నటించడానికి కండిషన్ పెట్టిందట . నా పాత్ర ఎక్కడ తగ్గకుండా హైలెట్ అవ్వాలి అని .. సినిమాలో హీరోకి ఎంత డిమాండ్ ఉంటుందో హీరోయిన్ క్యారెక్టర్ కి కూడా అంతే డిమాండ్ ఉండాలి అంటూ క్రేజీ కండిషన్ పెట్టిందట. సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది..!!