గుర్తుపట్టలేనంతగా మారిపోయిన జబర్దస్త్ వినోద్.. దీనస్థితికి కారణం అదేనా..?!

తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ కామెడీ షో జబర్దస్త్ లో ఇప్పటికే ఎంతోమంది కమెడియన్లుగా ఎంట్రీ ఇచ్చి స్టార్ కమెడియన్గా దూసుకుపోతున్నారు. సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ క్రేజ్‌సంపాదించుకుంటున్నారు. అయితే ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకపోయినా కంటెస్టెంట్ గా జబర్దస్త్ లో అడుగుపెట్టి స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో జబర్దస్త్ వినోధిని.. అలియాస్ వినోద్ ఇక‌తు. వినోద్ ఆడపిల్ల గెటప్ లో తన అందం, కామెడీ టైమింగ్ తో నవ్వులు పోయించాడు. ఎంతో కాలం జబర్దస్త్ స్టేజ్‌పై మెరిసిన వినోద్ గత కొంతకాలంగా జబర్దస్త్ కు దూరమైపోయాడు. దానికి కారణం ఏంటో అనే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వివరించాడు. లంగ్స్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ జబర్దస్త్ మానేసినట్లు ఆయన వివరించాడు. రెండేళ్ల క్రితం నుంచి ఈ ఇన్ఫెక్షన్కు ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడట.

అయితే ఊపిరితిత్తుల్లో నీరు పేరుకుపోవడంతో ఇన్ఫెక్షన్ వచ్చిందని ఈ వ్యాధి ఉన్నట్టు చాలా ఆలస్యంగా తెలిసిందని వివరించాడు. దీంతో చాలా బరువు తగ్గిపోయానని.. క్రమంగా వెయిట్ లాస్ అయ్యానని.. అయితే దానిని పెద్దగా పట్టించుకోకుండా నెగ్లెట్ చేశానని.. నెలలోనే ఒక్కసారి తగ్గిపోవడంతో టెస్టులు చేయించుకుంటే లంగ్స్ లో ఇన్ఫెక్షన్ ఉందని బయటపడింది అంటూ వివరించాడు. లంగ్స్ లో నీరు తీసేసి ట్రీట్మెంట్ తీసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. ఫుడ్ సమయానికి తీసుకోకపోవడం, బయట జంక్ ఫుడ్ తినడం కూడా దీనికి కారణమైంది అంటూ వివరించాడు. ఇప్పుడు ఆ సమస్య నుంచి ఆయన ఇటీవ‌ల కోలుకున్నారట.

అయితే ఇప్పటికి ట్రీట్మెంట్ జరుగుతూనే ఉందట. కాగా జబర్దస్త్ స్టేజ్ పై ఎంతో అందంగా మెరిసిన వినోద్ ఇప్పుడు అస్సలు గుర్తుపట్టలేనంతగా దీనంగా మారిపోయాడు. ఈ వ్యాధి వచ్చిన తర్వాత మానసికంగా కూడా నేను కృంగిపోయారని అది కూడా వెయిట్ లాస్‌కి కారణం అంటూ వివరించాడు. అలాంటి టైంలో నాకు ఫ్యామిలీ ఎంతో సపోర్ట్ గా నిలిచిందని.. జబర్దస్త్ కమెడియన్స్ కూడా నాకు చాలా సహాయం చేశారని.. మంచి డాక్టర్ని కలవడంలో వారు ఎంతో హెల్ప్ చేశారని వివరించాడు. ఫైనాన్షియల్ గా కూడా చాలా వరకు సహకారం అందిందని మంత్రి రోజా నాకు స‌హ‌కారం అందించార‌ని చెప్పుకొచ్చాడు. ఇక ఈ వ్యాధి నుంచి కోల్కున్న తర్వాత ఇప్పుడిపుడే అవకాశాలు వస్తున్నాయని.

మరిన్ని అవకాశాలు వచ్చి ఫ్యూచర్లో బిజీ అవ్వాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. అయితే ఓ పక్కన సమస్యతో బాధపడుతుండగా.. మరో పక్క తనను ఓ అమ్మాయి మోసం చేసిందంటూ వివరించాడు. చెల్లిల అమ్మాయిని నేను భావించానని.. అంతగా క్లోజైనా ఆ అమ్మాయి ఐదు లక్షలు డబ్బు అవసరమని అడగడంతో ఇచ్చానని.. అయితే ఆ డబ్బు తీసుకొని ఇవ్వకుండా మోసం చేసింది అంటూ ఎమోషనల్ అయ్యారు. ఓవైపు అనారోగ్య సమస్య, మరో వైపు తన డబ్బు తీసుకొని మోసం చేసి తర్వాత ఇప్పటివరకు ఆమె నాకు కనిపించలేదని ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో వివరించాడు. ప్రస్తుతం వినోద్ లేటెస్ట్ లుక్ ఆయన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.