“మెగా డాటర్ అయినా కూడా పిలిస్తే వెళ్తా..తప్పేంటి..?”..నీహారిక అడిగి కడిగిపారేసిందిగా..!!

నిహారిక .. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా బాగా ట్రెండింగ్ లో ఉన్న పేరు. విడాకులు తీసుకున్న తర్వాత నిహారిక లైఫ్ ఫుల్ గా టర్న్ అయిపోయింది. ఏడుపు అనేది దూరంగా సంతోషమనేది దగ్గరగా వచ్చేసింది . విడాకుల తర్వాత నిహారిక ఎంత హ్యాపీగా ఉందో ఆమె పెట్టే పోస్టు ద్వారానే తెలుస్తుంది. ఆఫ్ కోర్స్ విడాకుల అనేది ఒకరి వల్ల కాదు ఇద్దరి వల్ల జరిగిన తప్పు కారణంగానే తీసుకుంటారు.

 

చైతన్య – నిహారికల లైఫ్ లో ఏం జరిగిందో తెలియదు కానీ విడాకులు తీసుకొని మాత్రం ఇద్దరు హ్యాపీగానే ఉన్నారు . విడాకుల తర్వాత నిహారిక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది . పలు సినిమాలతో బిజీ బిజీగా ముందుకెళ్తుంది. వెకేషన్స్ కూడా ప్లాన్ చేసుకుంది . లైఫ్ ను బిందాస్ గా ఎంజాయ్ చేస్తుంది. రీసెంట్గా నిహారిక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

“నేను మెగా డాటర్ అయినప్పటికీ ఆడిషన్స్ ఇవ్వడానికి చాలా చాలా ఇష్టపడతాను .. ఒక మంచి సినిమా కోసం దర్శకులు ఎవరైనా సరే నన్ను ఆడిషన్ కి పిలిస్తే తప్పకుండా వెళ్తాను అందులో తప్పేముంది.. మెగా డాటర్ అయినంత మాత్రాన ఆడిషన్ కి వెళ్ళకూడదా..? అంటూ ప్రశ్నించింది “. నిహారిక మాట్లాడిన మాటలు చాలా మెచ్యూర్డ్ గా ఉన్నాయి . నిహారిక క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అంతేకాదు నిహారిక కచ్చితంగా సెకండ్ ఇన్నింగ్స్ లో భారీ సక్సెస్ అందుకుంటుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు . చూద్దాం మరి నిహారిక లైఫ్ ఎలా టర్న్ అవ్వబోతుందో..???