సూర్య కిరణ్ చనిపోవడానికి కారణం అదే..ఆ ఒక్క తప్పు చేయకపోతే బ్రతికి ఉండేవాడా..? తేల్చేసిన డాక్టర్లు..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న సూర్యకిరణ్ నిన్న తుది శ్వాస విడిచారు . ఆయన చేసిన సినిమాలు కొన్ని అయినప్పటికీ జనాలలో మాత్రం మంచి పేరు సంపాదించుకున్నాడు . ఒకప్పటి హీరోయిన్ కళ్యాణి భర్తనే ఈ సూర్య కిరణ్ . వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా వాళ్ళు విడాకులు తీసుకున్నారు . అయినప్పటికీ సూర్యకిరణ్ – కళ్యాణి అంటే ఎక్కువగా ఇష్టపడేవారు .

పలు ఇంటర్వ్యూలలో కూడా ఆమె గురించి పాజిటివ్ గానే స్పందించే వాడు. కాగా బిగ్ బాస్ సీజన్ లో కూడా అడుగుపెట్టిన సూర్యకిరణ్ తన అప్పులు తీర్చుకోవడానికి బిగ్బాస్ సీజన్ లోకి వచ్చాను అని చెప్పుకొచ్చారు. కానీ ఆయన మొదటి వారంలోని వెనతిరగడం ఆయనకు రెమ్యూనరేషన్ తక్కువగా రావడం అప్పట్లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది . కాగా అంతా బాగుంది సూర్యకిరణ్ మెల్లమెల్లగా లైఫ్ లో సెటిల్ అవ్వడానికి చూస్తున్నాడు అనుకున్న మూమెంట్లోనే సూర్యకిరణ్ మరణించాడు అన్న వార్త సోషల్ మీడియాలో రావడంతో జనాలు షాక్ అయిపోయారు.

మొదట ఇదంతా ఫేక్ అనుకున్నారు కానీ ఆ తర్వాత నిజం తెలుసుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు . నిజానికి సూర్యకిరణ్ పూర్తి ఆరోగ్యవంతుడిగా ఉండేవాడు . కానీ విడాకుల తర్వాత ఆయన పూర్తిగా ఆల్కహాల్ కి అడిక్ట్ అయిపోయారట . అంతేకాదు ఆయనకు మొదటి నుంచి కూడా పచ్చకామెర్లు ఎక్కువగా ఉండేటివట . దీనికి తగ్గట్టు ఆయన డైట్ ఫాలో అవ్వకుండా హెల్త్ ని నెగ్లెక్ట్ చేయడంతోనే ఆరోగ్యం మరింత క్షీణించిందని ..అయినా కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోకుండా ఆయన నిర్లక్ష్యం చేశాడు అని.. ఆ కారణంగానే ఆయన తుదిశ్వాస విడిచారు అని లేకపోతే సూర్యకిరణ్ ట్రీట్మెంట్ తీసుకుంటే మరికొన్నాళ్లు బతికుండేవాడు అని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. డాక్టర్స్ కూడా ఇదే విషయాన్ని చెప్పుకొస్తున్నారు . దీంతో సూర్యకిరణ్ ఫ్యాన్స్ బాగా బాధపడిపోతున్నారు. నేడు చెన్నైలో ఆయన అంతక్రియలు జరగబోతున్నాయి..!!