గోల్డెన్ ఆఫర్ పట్టేసిన అనసూయ .. ఏకంగా ఆ స్టార్ హీరోతో రొమాన్స్.. ఇక కుర్రాళ్లకి పండగే..!?

అనసూయ .. అందాల ముద్దుగుమ్మ . అమ్మడు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒకటా..? రెండ..? చేతుల్లో ఆరుకు పైగానే ప్రాజెక్టులు పట్టుకొని ఉంది , జబర్దస్త్ యాంకర్ గా ఒకప్పుడు పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ .. ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ కి మించిన రేంజ్ లో దూసుకుపోతుంది .. అంటే కారణం మాత్రం ఖచ్చితంగా ఆమెకి ఉన్న టాలెంట్ అని చెప్పాలి . మరి ముఖ్యంగా రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర పోషించిన తర్వాత ఓ రేంజ్ లో పెరిగిపోయింది.

పుష్ప సినిమాలో దాక్షాయిని పాత్రలో బాగా నటించి మెప్పించింది . పుష్ప 2 సినిమాలో కూడా ఈమె పాత్ర హైలెట్గా మారబోతుంది అంటూ తెలుస్తుంది . పలు అవకాశాలు అందుకుంటూ తన లైఫ్ని ముందుకు తీసుకెళుతున్న అనసూయ గోల్డెన్ ఆఫర్ పట్టేసింది అన్న వార్త వైరల్ అవుతుంది. అనసూయ చిరంజీవి నటించిన విశ్వంభర సినిమాలో హీరోయిన్గా కీలక పాత్ర కోసం సెలెక్ట్ అయిందట .

ఈ సినిమాలో అనసూయ చిరంజీవిల మధ్య ఫన్నీ రొమాన్స్ కూడా ఉండబోతుందట . గతంలో అనసూయ చిరంజీవి పలు సినిమాలలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే ఈ సినిమాలో అనసూయ పాత్ర మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుంది అని వశిష్ట చాలా రియలిస్టిక్ గా ఆమె పాత్ర రాసుకున్నాడు అని తెలుస్తుంది. దీంతో కుర్రాళ్ళు బాగా ట్రెండ్ చేస్తున్నారు. బింబిసారా డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమానే ఈ విశ్వంభర. ఈ సినిమాలో హీరోయిన్గా త్రిష నటిస్తుంది . త్రిష కూడా ఈ సినిమాలో డ్యూయెల్ రోల్ లో కనిపించబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది..!!