ఇంకెన్ని జన్మలెత్తినా నా భార్య స్థానం కల్యాణిదే.. సూర్య కిరణ్ చివరి మాటలివే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శకుడిగా, నటుడుగా సూర్యకిరణ్ త‌నకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఈయన కనిపించింది అతి తక్కువ సినిమాలే అయినా.. దర్శకుడుగా మంచి పేరును సొంతం చేసుకున్నాడు. సత్యం, రాజు భాయ్ సినిమాలు సూర్యకిరణ్‌కు డైరెక్టర్గా మంచి క్రేజ్‌ తెచ్చిపెట్టాయి. ఇక ఈయన బాల నటుడిగా 200 త‌కుపైగా సినిమాల్లో నటించి మెప్పించాడు. కొన్ని సినిమాల్లో సూర్యకిరణ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా కనిపించాడు. ఇటీవల ఆయన అనారోగ్య సమస్యల‌తో మరణించడంతో టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. కొన్ని రోజులుగా జాండీస్‌తో ఇబ్బంది పడుతున్న సూర్యకిరణ్ తాజాగా గుండెపోటుతో మృతి చెందినట్లు సమాచారం.

Telugu film director Surya Kiran passes away in Chennai

ఇక ఆయ‌న‌ టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 లోనూ కంటెస్టెంట్ గా పాల్గొని సందడి చేశాడు. అయితే గతంలో సూర్యకిరణ్ హీరోయిన్ కళ్యాణిని ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఏవో కారణాలతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. అయితే సూర్యకిరణ్ చనిపోవడానికి ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భార్య కళ్యాణి గురించి కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన మరణించడంతో తాజాగా ఆయన చివరిగా చేసిన కామెంట్స్ నెటింట‌ వైరల్ గా మారుతున్నాయి. సూర్యకిరణ్.. కళ్యాణి గురించి మాట్లాడుతూ అమ్మ తర్వాత అమ్మ అంటే ఆమె అంటూ వివరించాడు.

Bigg Boss Telugu 4's first evicted contestant Surya Kiran: I couldn't  survive because the rest were doing anything to grab footage | The Times of  India

కళ్యాణిని నేను ఇప్పటికీ రోజు మిస్ అవుతూనే ఉన్నానని.. నా సిస్టర్స్ పై నాకు ఎంత ప్రేమ ఉందో కళ్యాణిపై కూడా నాకు అంతే ప్రేమ ఉంది అంటూ వివరించాడు. నేను తనకు అవసరం లేకపోయినా.. ఆమె నాకు ఎప్పటికీ అవసరమే అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. ఇప్పటికి తన ఫోనట్లో, లాప్‌టాప్‌లో కళ్యాణి ఫోటో ఉంటుందని వివరించాడు. ఇంకెన్ని జన్మలెత్తిన నా భార్య స్థానం కళ్యాణిదే అంటూ ఆయన పేర్కొన్నాడు. సూర్యకిరణ్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం నెటింట వైరల్ గా మారడంతో.. అంతగా ప్రేమించిన ఆమెకు విడాకులు ఇవ్వడానికి అసలు కారణం ఏమై ఉంటుంది అంటూ అంతా షాక్ అవుతున్నారు. సూర్యకిరణ్ ఆత్మకు శాంతి చేకూరాలని కామెంట్లు చేస్తున్నారు.