కర్మ కాలి “పుష్ప 2 – కల్కి” సినిమాలు ఒకే తేదీన రిలీజ్ అయితే ..ఏ సినిమా హిట్ – ఏ సినిమా ప్లాప్ అవుతుంది..?

ప్రజెంట్ సోషల్ మీడియాలో ఈ వార్త బాగా వైరల్ గా మారింది . సినీ లవర్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న రెండు బడా సినిమాలు ఒకే తేదీన రిలీజ్ కాబోతున్నాయి అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా కల్కి. ఈ సినిమా మే 9 రిలీజ్ కావాల్సి ఉంది . మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు . కానీ మే 13న ఏపీలోని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ సినిమాను పోస్ట్ పోన్ చేయాలి అంటూ మేకర్స్ ఆలోచిస్తున్నారట .

అంతేకాదు మంచి డేట్ కోసం ఎదురుచూస్తూ ఆగస్టులో రిలీజ్ చేయాలి అంటూ ఫిక్స్ అయ్యారట. ఆల్రెడీ ఆగస్టు 15వ తేదీ పుష్ప2 సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు అల్లు అర్జున్ . ఎప్పుడో ఈ డేట్ ని బ్లాక్ చేసుకున్నాడు . అయితే ఇప్పుడు అదే తేదీన ప్రభాస్ నటించిన కల్కి రిలీజ్ అయితే పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటూ సినీ విశ్లేషకులు ఆరాతీస్తున్నారు.

సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అప్పుడే రచ్చ రంబోలా క్రియేట్ చేసేస్తున్నారు . మా హీరో సినిమా హిట్ అంటే మా హీరో సినిమా హిట్ అంటూ తెగ పొగిడేసుకుంటున్నారు . అయితే ఒకవేళ పరిస్థితులు అనుకూలించక పుష్ప2 కల్కి సినిమాలు ఒకే తేదీన రిలీజ్ అయితే ఏ సినిమా హిట్ అవుతుంది..? ఏ సినిమా నెగిటివ్ టాక్ క్రియేట్ చేసుకుంటుంది అని..? మీరు అనుకుంటున్నారు . మీ ఆన్సర్స్ ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి..!!