ఫైనల్లీ ఆ హీరోయిన్ విషయంలో అనుకున్నది సాధించిన సుకుమార్.. మహాగట్టోడే..!

అందరూ అనుకుంటూ ఉంటారు . సుకుమార్ చాలా సాఫ్ట్ అని.. తన పని తాను చూసుకుని పోతాడు అని.. అయితే సుకుమార్ తన పని తాను చూసుకొని పోతాడు కానీ సాఫ్ట్ కాదు ..గట్టోడు అనుకున్నది సాధించే టైప్ .. ఆ విషయం ఆలస్యంగా ప్రూవ్ చేసుకున్నాడు సుకుమార్ . సుకుమార్ ఏదైనా హీరోయిన్ విషయంలో నిర్ణయం తీసుకున్నాడు అంటే అది ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే ఖచ్చితంగా అమలు చేస్తాడు.

ఒక హీరోయిన్ ని తన సినిమాలో వర్క్ చేయించాలి అని అనుకున్నాడు ..అంటే ఒకటి రెండు సార్లు మిస్సయిన మూడోసారి కచ్చితంగా పట్టేస్తాడు .. ఫైనల్లి సుకుమార్ మోస్ట్ ఫేవరెట్ హీరోయిన్ తో సినిమాకు ఓకే చేయించుకున్నాడు . ఆమె మరెవరో కాదు సాయి పల్లవి. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సాయి పల్లవి సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయిందట.

ప్రజెంట్ పుష్ప2 సినిమా షూట్ లో బిజీగా ఉన్న సుకుమార్ త్వరలోనే రామ్ చరణ్ తో ఒక సినిమాకి సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు. దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది . రాంచరణ్ ప్రజెంట్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు. ఆ తర్వాత సుకుమార్ తో సినిమా చేస్తున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు మేకర్స్ .అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవిని చూస్ చేసుకున్నాడట సుకుమార్ . మొదటి నుంచి సుకుమార్ కి సాయి పల్లవి అంటే అదొక బెస్ట్ ఇంప్రెషన్ ..లేడీ పవర్ స్టార్ అంటూ ఆమెకు ట్యాగ్ ఇచ్చింది కూడా సుకుమారే..!!