ఎన్టీఆర్ నటించిన సినిమాలలో మళ్లీమళ్లీ చూడాలి అనిపించే మూవీ ఇదే .. ఆడవాళ్లకు ఎంత ఇష్టం అంటే..!

కొన్ని సినిమాలు మన మనసుకు బాగా దగ్గరవుతాయి . కేవలం అలా చూసి ఇలా ఎంటర్టైన్ అయి.. సైలెంట్ గా అయిపోవడం కాదు.. మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. అలాంటి సినిమాలు చాలా చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. అలాంటి సినిమాల్లో ఒకటే ఎన్టీఆర్ నటించిన రాఖీ. ఈ రాఖీ సినిమా ప్రతి అమ్మాయికి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి అమ్మాయికి మనసుకు హత్తుకునే సినిమా . అప్పటివరకు తొడ కొట్టడాలు – నరకడాలు లాంటి పాత్రలో కనిపించిన ఎన్టీఆర్ సెంటిమెంట్ పాత్రలో కనిపించి అభిమానుల మనసులను కొల్లగొట్టాడు.

మరీ ముఖ్యంగా లేడీ ఫాన్స్ ను సంపాదించుకొని శభాష్ – తారక్ అని అనిపించుకునేలా చేసాడు . సోషల్ మీడియాలో ప్రజెంట్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఈ వార్త బాగా బాగా వైరల్ గా మారింది . ఎన్టీఆర్ తన కెరియర్ లో ఎన్నో సినిమాల్లో నటించాడు . కానీ లేడీస్ అందరికీ కూడా ఎన్టీఆర్ ని బాగా దగ్గరకు చేసిన సినిమా ఏది అంటే మాత్రం రాఖీ అనే చెప్పాలి . కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఛార్మి – ఇలియానా హీరోయిన్లుగా నటించారు .

ఈ సినిమా పూర్తి సిస్టర్ సెంటిమెంట్ ఆధారంగా తెరకెక్కింది . సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది ఈ సినిమాని ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు . ఇంకా ఇంకా చూడాలి అని అనిపిస్తూనే ఉంటుంది. ప్రజెంట్ ఎన్టీఆర్ దేవర అనే సినిమాలో నటిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతూ ఉండడం గమనార్హం . ఆచార్య లాంటి బిగ్ డిజాస్టర్ తర్వాత కొరటాల ఈ సినిమాతోనే తన లక్ ని పరీక్షించుకోబోతున్నాడు . చూద్దాం మరి సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో…?