రష్మిక మందన్నని ఆనంద్ దేవరకొండ అలా పిలుస్తాడా..? ఒక్క పిక్ తో బయటపడ్డ అసలు సీక్రేట్..!

ఆనంద్ దేవరకొండ ..ఇండస్ట్రీలో ఈ పేరుకి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఆఫ్ కోర్స్ ఆనంద్ దేవరకొండ – విజయ్ దేవరకొండ బ్రదర్ గానే గుర్తింపు సంపాదించుకున్నాడు . బేబీ సినిమా హిట్ అయిన తర్వాతనే ఆయన హీరోగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు . రీసెంట్గా ఆనంద్ దేవరకొండ తన బర్త్డ డేను గ్రాండ్గా జరుపుకున్నాడు .

కాగా పలువురు ఆయన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆనంద్ దేవరకొండకు విషెస్ అందజేశారు . హీరోయిన్ రష్మిక మందన్నా కూడా ఆనంద్ దేవరకొండకు వెరైటీగా విష్ చేసింది . ఆయన గోడ చాటున దాక్కుని ఉన్న ఒక ఫోటోను షేర్ చేస్తూ ..”హ్యాపీ బర్త్డ డే”.. ఆనంద అంటూ ట్యాగ్ చేసింది. దీనికి ఆనంద్ దేవరకొండ..” థాంక్యూ రషి కానీ ఇంత చెత్త ఫోటో షేర్ చేసావేంటి..?” అంటూ ప్రశ్నిస్తాడు . దీనికి రష్మిక రివర్స్ కౌంటర్ ఇస్తుంది .

“అందుకే కదరా నేను చెప్పేది.. నేను అడిగినప్పుడు ఫోటోకి ఫోజులు బాగా ఇవ్వు అని ” అంటూ కౌంటర్ వేస్తుంది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. రష్మిక మందన్నా.. ఆనంద్ దేవరకొండ ఇంత క్లోజ్ గా మాట్లాడుకోవడం నెట్టింట వైరల్ అవుతుంది. అదేవిధంగా ఆనంద్ దేవరకొండ రష్మిక ముద్దుగా ప్రేమగా “రషి” అంటూ పిలుస్తాడు అన్న విషయం కూడా బయట పడిపోయింది.

విజయ్ దేవరకొండ .. ఆనంద్ దేవరకొండ బ్రదర్స్.. ఆనంద్ దేవరకొండ బ్రదర్ విజయ్ దేవరకొండ తో రష్మిక మందన ప్రేమాయణం నడుపుతుంది అంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి . త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు ఈ జంట అంటూ కూడా ప్రచారం జరుగుతుంది . ఏమో.. ఏం జరుగుతుందో వేచి చూద్దాం..!!