రష్మిక ఫారిన్ వెళ్లితే ఏం కొంటుందో తెలుసా..? ఈ పిచ్చి కూడా ఉందా..?

జనరల్ గా ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది . ట్రావెలింగ్ చేసేటప్పుడు ఇది కొనాలి.. అది కొనాలి అంటూ ఎవరో ఒకరు ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు . అయితే ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ గా గా ఉన్న హీరోయిన్స్ కూడా అదే విధంగా ఆలోచిస్తారా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . మరి ముఖ్యంగా రష్మిక మందన్నా.. ఫారిన్ కి వెళ్తే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఒక పది బ్యాగుల నిండా టెడ్డీ బియర్స్ కొనుక్కొచుకుంటుందట .

ఆమెకు అంత పిచ్చట . చిన్నతనంలో ఆమెకు బొమ్మలంటే చాలా చాలా ఇష్టం ఉండేదట . కానీ తన తల్లిదండ్రులుకు అంత స్తోమత ఉండేది కాదట . ఆ టైంలో రష్మిక బొమ్మలు అడిగిన పేరెంట్స్ కొనిచ్చేవారు కాదట . అప్పుడే డిసైడ్ అయిందట పెద్దయ్యాక డబ్బులు సంపాదించుకొని బొమ్మలు కొనుక్కోవాలి అని .. ఇప్పటికీ ఏ ఫారిన్ కంట్రీ కి వెళ్ళిన రకరకాల టాయ్స్ ను కొనుగోలు చేసి ఇంట్లో సేకరించి పెట్టుకుంటుందట .

అంతేకాదు రష్మిక మందన్నా.. ఇప్పటికి టాయ్స్ తో ఆడుకుంటుందట. రాత్రి నిద్రపోయే సమయంలోను ఆమెకు బొమ్మలు పక్కన ఉండాల్సిందేనట . రష్మికకు ఇలాంటి పిచ్చి కూడా ఉందా అంటున్నారు జనాలు. కొంతమంది క్యూట్గా వెరీ ఫన్నీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రసెంట్ రష్మిక పుష్ప 2 సినిమా షూట్ లో బిజీగా ఉంది. బాలీవుడ్ లో మూడు సినిమాలల్లో నటిస్తుంది..!!